News March 16, 2025
తాడూర్: విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు తెలకపల్లి తెలంగాణ మహాత్మ జ్యోతిరావు ఫులే గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9 తొమ్మిదవ తరగతిలో 2025-26 సంవత్సరానికి మిగిలిన సీట్లు భర్తీ చేసేందుకు తాడూర్ గురుకుల ప్రిన్సిపల్ రష్మీ నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31వ తారీఖు చివరి తేదీ అని తెలిపారు. ఏప్రిల్ 20వ తేదీన పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. 6వ తరగతి ప్రవేశానికి 12 ఏళ్ల వయసు ఉండాలని తెలిపారు.
Similar News
News March 17, 2025
Stock Markets: నిఫ్టీ 150+, సెన్సెక్స్ 450+ అప్

ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 22,549 (+153), సెన్సెక్స్ 74,275 (+470) వద్ద ట్రేడవుతున్నాయి. ఫార్మా, హెల్త్‌కేర్, ఆటో, మెటల్, ఎనర్జీ, PSE, CPSE, వినియోగం, చమురు, బ్యాంకు షేర్లకు గిరాకీ ఉంది. మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు ఎగిశాయి. ఇండస్‌ఇండ్, బజాజ్ ట్విన్స్, SBI లైఫ్, Dr రెడ్డీస్ టాప్ గెయినర్స్. నెస్లే, BPCL టాప్ లూజర్స్.
News March 17, 2025
భువనగిరి కోటపైన రోప్ వే

భువనగిరి కోటపైన రోప్ వే త్వరలోనే అందుబాటులోకి రానుంది. కి.మీ మేర దీనిని నిర్మించేందుకు పర్యాటక సంస్థ రూ.56.81 కోట్లతో టెండర్లను పిలిచింది. HYD-WGL హైవే నుంచి కోట వరకు ఈ రోప్ వే ఉండనుండగా రాష్ట్రంలో ఇది మొదటిది కానుంది. మరో నాలుగు రోప్ వేలకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా అందులో యాదాద్రి టెంపుల్, నల్గొండ హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ ఆనకట్ట ఉన్నాయి.
News March 17, 2025
1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

TG: బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి గత ఏడాది రాష్ట్రంలో 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొదట లాభాలను ఎరవేసే మోసగాళ్లు ఆపై నిండా ముంచుతున్నారు. దీనికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రమోషన్ తోడవ్వడంతో తారాస్థాయికి చేరింది. తాజాగా పలువురు నెటిజన్లు వీటిని వ్యతిరేకిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి సజ్జనార్ తోడవ్వడంతో ప్రమోటర్స్‌పై ప్రభుత్వం చర్యలకు దిగింది.