News January 29, 2026

తాడేపల్లిగూడెంలో జనసేన జోరు -1

image

తాడేపల్లిగూడెంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. వైకాపాలో మాజీ మంత్రి కొట్టు సత్యానారాయణ, ప్రస్తుత ఇన్‌ఛార్జ్ వడ్డి రఘురాం వర్గాల మధ్య విభేదాలు, తాజా సమావేశానికి కొట్టు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. అటు టీడీపీలోనూ వలవల బాబ్జి, పసల కొండ వర్గాల నడుమ అసంతృప్తి నెలకొంది. ప్రధాన పార్టీల్లోని ఈ అంతర్గత కలహాలను తమకు అనుకూలంగా మలచుకుంటూ జనసేన క్షేత్రస్థాయిలో దూకుడు పెంచింది.

Similar News

News February 18, 2026

నరసాపురం: పెళ్లైన విషయం దాచి బాలికతో ప్రేమ.. చివరికి..!

image

నరసాపురం రుస్తుంబాదకు చెందిన వివాహితుడు కొవ్వెల కళ్యాణ్, తనకు పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి ఓ బాలికను రెండేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసగించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. మంగళవారం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్‌కు తరలించినట్లు DSP డా.శ్రీవేద తెలిపారు. నరసాపురం టౌన్ SI సీహెచ్ జయలక్ష్మి కేసు నమోదు చేశారు.

News February 18, 2026

‘ప్రతినెల మూడో శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్’

image

ప.గో జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ డేగా ప్రతి నెలలో 3వ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నాగరాణి తెలిపారు. కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉదయం గం.10 నుంచి నిర్వహించడం జరుగుతుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు ఈ గ్రీవెన్స్ డేకి హాజరై వారి సమస్యల పరిష్కారానికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.