News April 1, 2025
తాడేపల్లిగూడెంలో ఫోక్సో కేసు నమోదు

తాడేపల్లిగూడెంలోని కడగట్లకు చెందిన నాగరాజుపై టౌన్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు సోమవారం నమోదయింది. సీఐ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం.. 2 రోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి యత్నిస్తుండగా మేనమామ చూసి కేకలు వేగా నాగరాజు పరారయ్యాడన్నారు. మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News April 2, 2025
ప.గో: ఇంటర్ సెకండియర్ క్లాసులు ప్రారంభం

నూతన విద్యా విధానంలో భాగంగా ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసులు జిల్లాలో ముందస్తుగా మంగళవారం ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 23 వరకు తరగతులు జరుగుతాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి నాగేశ్వరరావు తెలిపారు. సమ్మర్ హాలీడేస్ అనంతరం తిరిగి జూన్ 2న మళ్లీ తరగతులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇటు ఫస్టియర్ ప్రవేశాలు ఈ నెల 7 నుంచి మొదలవుతాయి. ఆ తర్వాత వారికీ తరగతులు ప్రారంభిస్తారు.
News April 2, 2025
భీమవరంలో వృద్ధురాలిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

భీమవరం పట్టణంలోని ఈ నెల 28న అమ్మిరాజు తోటలో దొంగతనం కేసులో పట్టణానికి చెందిన నిందితుడు విట్టర్ పాల్‌ను సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా పట్టుకున్నారు. డీఎస్పీ జై సూర్య తెలిపిన వివరాల ప్రకారం.. వృద్ధురాలు మంగతాయారు ఇంటికి వెళ్లి దగ్గర బంధువునని చెప్పి 3 గంటల పాటు విట్టర్ కబుర్లు చెప్పాడు. ఆమె భర్త బయటకు వెళ్ళగానే వృద్ధురాలిపై బ్లేడుతో దాడి చేసి బంగారాన్ని దొంగిలించాడు.
News April 2, 2025
హత్య జరిగిన 36 గంటల్లో నిందితుడు అరెస్ట్: సీఐ

కాసాని రాజేశ్ మృతికి కారణమైన నిందితుడిని అరెస్ట్ చేశామని భీమవరం రూరల్ సీఐ బి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ నెల 30న కోట సత్తెమ్మ తల్లి జాతరలో రాహుల్, రాజేశ్ మధ్య వివాదం తలెత్తి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో రాజేశ్‌ను మేకల సతీష్ అనే వ్యక్తి (చోటూ) కొట్టాడు. గాయాలతో రాజేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడ్ని 36 గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.