News January 16, 2025

తాడేపల్లిగూడెం: అసలు ఎవరీ రత్తయ్య..?

image

సంక్రాంతి నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో వేలల్లో పందేలు జరిగాయి. వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఈసారి తాడేపల్లిగూడెంలో ఏకంగా రూ.1.25 కోట్ల పందెం జరిగింది. కోడిపందేల్లో పేరు మోసిన రత్తయ్య పుంజు, గుడివాడ ప్రభాకర్ పుంజు మధ్య రసవత్తరంగా పందెం జరిగింది. ఎంతో పేరు మోసిన రత్తయ్య పుంజు ఓడిపోవడంతో అందరూ ఖంగుతిన్నారు. అసలు ఎవరీ రత్తయ్య అని ఆరా తీయగా.. ఆయనది లింగపాలెం మండలం రంగాపురం అని తేలింది.

Similar News

News October 30, 2025

మొంథా తుపాన్‌తో ప.గో. జిల్లాలో నష్టం వివరాలు ఇవే!

image

తుపాను, భారీ వర్షాల కారణంగా ప.గో జిల్లాలో 93 ఇళ్లు, 174 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. బలమైన ఈదురు గాలులు కారణంగా 662 చెట్లు నేల కొరిగాయని, రోడ్లపై విరిగిపడిన చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో తోకతిప్ప, బియ్యపు తిప్ప గ్రామంలో రోడ్లపై ఒక అడుగు మేర వర్షపు నీరు నిలిచిందన్నారు.

News October 30, 2025

మొంథా తుఫాను కంట్రోల్ రూమ్ తనిఖీ చేసిన కలెక్టర్

image

కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం భీమవరం కలెక్టరేట్‌లోని “మొంథా తుఫాను” కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. కంట్రోల్ రూమ్‌కి వచ్చిన కాల్స్ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు, డివిజనల్, మండల కేంద్రాల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే సంబంధిత శాఖల దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కార చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

News October 29, 2025

నరసాపురం: ప్రజలతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

image

నరసాపురం మండలంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను బుధవారం కలెక్టర్ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. తొలుత జిల్లా కలెక్టర్ పీఎం లంకలో డిజిటల్ భవన్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి,  ఆశ్రయం పొందిన వారిని ఆప్యాయంగా పలకరించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు భోజనాన్ని స్వయంగా వడ్డించి కలెక్టర్ కూడా వారితో పాటు కూర్చుని భోజనాన్ని స్వీకరించారు.