News March 13, 2026

తాడేపల్లిగూడెం: మూడు బార్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

image

తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో 3 జనరల్ కేటగిరి బార్ లైసెన్స్ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 24వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈనెల 25 ఉదయం 8 గంటలకు భీమవరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో లక్కీ డ్రా తీయనున్నట్లు వివరించారు.

Similar News

News April 14, 2026

భీమవరం కలెక్టరేట్‌లో అంబేడ్కర్ జయంతి

image

భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు జరిగాయి. కలెక్టర్ చదలవాడ నాగరాణి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని అసమానతల తొలగింపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News April 14, 2026

TPG: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రూరల్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ సంఘటన తాడేపల్లిగూడెం మండలం పడాల ఒక పత్రిక కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు వివరించారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

News April 14, 2026

ప్రైవేటు స్కూళ్ల అడ్మిషన్ల ప్రకటనలతో జాగ్రత్త: డీఈవో

image

అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలు 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్లు ఇచ్చే ప్రకటనలను నమ్మవద్దని డీఈవో నారాయణ తల్లిదండ్రులను హెచ్చరించారు. పాఠశాలకు గుర్తింపు ఉందో లేదో, భవన వసతులు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ప్రకటనలు జారీ చేసే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.