News December 15, 2025
తాడేపల్లిగూడెం: 17, 18 తేదీల్లో PG, PHD కోర్సులకు కౌన్సిలింగ్

తాడేపల్లిగూడెం(M) వెంకటరామన్న గూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈనెల 17, 18వ తేదీల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులలో ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 17న పీజీ, 18న పీహెచ్‌డీ కోర్సులకు మాన్యువల్ కౌన్సిలింగ్ జరుగుతుందని, అర్జీదారులు తమ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.
Similar News
News December 17, 2025
ఉండి: ఫలించిన ప్రియురాలు ధర్నా.. కథ సుఖాంతం

ఉండి మండలం మహాదేవపట్నం శివారు రామచంద్రపురానికి చెందిన భానుప్రకాష్ ఇంటి ముందు సోమవారం సాయంత్రం ప్రియురాలు దుర్గాభవాని కుటుంబ సమేతంగా సోమవారం ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి వ్యవహారం ఉండి పోలీస్ స్టేషన్‌కు చేరటంతో ఎట్టకేలకు ప్రియుడు దిగివచ్చాడు. పెళ్లి చేసికోవడానికి అంగీకరించాడు. పెద్దల సమక్షంలో పత్రాలు రాయడంతో కథ సుఖాంతమైంది.
News December 17, 2025
టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలి: కలెక్టర్

జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు పురపాలక సంఘాల పరిధిలోని టిడ్కో ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. జిల్లాలో ఫేజ్- 1, ఫేజ్ -2 కింద 21,424 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఇప్పటి వరకు 8,832 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించినట్లు చెప్పారు.
News December 16, 2025
TDP ప.గో జిల్లా అధ్యక్షుడిగా రామరాజు..?

TDP పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు (కలవపూడి రాంబాబు) నియమితులైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం APIIC ఛైర్మన్‌గా ఉన్నారు. గతంలోనూ TDP జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. రెండో సారి కూడా రామరాజును జిల్లా అధ్యక్షుడిగా నియమించడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.


