News March 9, 2025
తాడేపల్లిలో అంబాజీపేట యువకుడిపై దాడి

అంబాజీపేట మండలం వక్కలంకకి చెందిన వాసంశెట్టి సంతోష్‌కి విజయవాడకు చెందిన హరికృష్ణకు తాడేపల్లి(M) వడ్డేశ్వరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఘర్షణ జరిగింది. దీంతో అతడిని చంపాలని గ్యాంగ్‌తో కలిసి హత్యాయత్నం చేసేందుకు యత్నించారు. అతడు ఒంటరిగా కారులో వెళుతున్న సమయంలో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సంతోష్‌ని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంతోష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు CI తెలిపారు.
Similar News
News October 27, 2025
సింగర్ మృతి.. చివరి సినిమాకు భారీ క్రేజ్

అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ SEP 19న సింగపూర్‌లో <<17805488>>మృతిచెందిన<<>> సంగతి తెలిసిందే. ఆయన లీడ్ రోల్ నటించి, మ్యూజిక్ అందించిన చివరి సినిమా ‘రోయ్ రోయ్ బినాలే’ OCT 31న విడుదలవుతోంది. టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా గంటలోనే 15K+ అమ్ముడయ్యాయి. BMSలో ఇప్పటివరకు 98K+ ఇంట్రస్ట్‌లు నమోదయ్యాయి. దీంతో ఇది ₹100CR గ్రాస్ కలెక్షన్స్ సాధించే తొలి అస్సామీ సినిమాగా నిలిచే అవకాశం ఉందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.
News October 27, 2025
MHBD: 61లిక్కర్ షాపులకు లక్కీ పర్సన్స్ ఎవరో..!

మహబూబాబాద్ జిల్లాలో 61 లిక్కర్ షాపులు ఉన్నాయి. ఈ నెల 23న లిక్కర్ షాపులకు దరఖాస్తుల గడువు ముగిసింది. జిల్లాలో 61 లిక్కర్ షాపులకు 1800 దరఖాస్తులు అందాయి. AB ఫంక్షన్ హాల్లో సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో డ్రా తీయనున్నారు. లక్కీ డ్రా లో 61 లక్కీ పర్సన్స్ ఎవరనేది తేలనున్నది. కొత్త లిక్కర్ షాపులను కేటాయించనున్నారు.
News October 27, 2025
NZB: నేడు ‘లక్కీ’గా వైన్స్‌లు దక్కేదెవరికి?

మద్యం షాపుల టెండర్లకు నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు రేపు లక్కీ డ్రా తీయనున్నారు. జిల్లాలోని 102 లిక్కర్ షాపులకు 2,786 దరఖాస్తులు వచ్చాయి. దీనితో జిల్లా ఎక్సైజ్ శాఖకు ఒక్కో టెండర్‌కు రూ.3 లక్షల చొప్పున రూ83.58కోట్ల ఆదాయం లభించింది. లక్కీ డ్రాలో అదృష్టం ఎవరిని వరించనుందో చూడాలి. అయితే గత టెండర్లలో 3,759 దరఖాస్తులు రాగా.. ఈసారి టెండర్లను రూ.3 లక్షలకు పెంచడంతో దరఖాస్తులు తగ్గాయి.


