News December 27, 2024

తాడేపల్లిలో రైల్వే కోడూరు కానిస్టేబుల్ మృతి

image

రైల్వే కోడూరు మండలానికి చెందిన 95వ బ్యాచ్, 11వ బెటాలియన్‌‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజయ్య గురువారం మృతి చెందాడు. సీఎం క్యాంప్ కార్యాలయానికి 15 రోజుల క్రితం డ్యూటీ నిమిత్తం తాడేపల్లికి వెళ్లారు. 2 రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండగా గురువారం చికిత్స నిమిత్తం మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అతను అప్పటికే చనిపోయినట్టు ధ్రువీకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

Similar News

News February 18, 2026

ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా శనగల కొనుగోలు: కలెక్టర్

image

ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా శనగ కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని, రబీ సీజన్‌‌కు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5,875గా ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. కడప జిల్లాలో సుమారు 80,103 హెక్టార్లలో శనగ సాగు జరిగిందని పేర్కొన్నారు. రైతులు దళారుల మోసాలకు గురికాకుండా MSP ధరకు విక్రయించాలన్నారు. పులివెందుల, తొండూరు, JMD, ముద్దనూరు, కమలాపురం మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయన్నారు.

పులివెందులకు రానున్న వైఎస్ జగన్?

image

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 24, 25వ తేదీలలో పులివెందులలో పర్యటించనున్నట్లు సమాచారం. 24వ తేదీ పులివెందులకు చేరుకుని, 25వ తేదీ వేంపల్లి మండలం నందిపల్లెలోని నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ వేడుకలలో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే ఈ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.