News April 7, 2025
తాడేపల్లి: ఆర్థిక వివాదం.. యువకుడి హత్య

తాడేపల్లిలో ఓ యువకుడు హత్య కలకలం రేపింది. ఆదివారం జరిగిన హత్యపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్థిక వివాదంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అది హత్యకు దారితీసిందన్నారు. భరత్ అనే యువకుడు వర్ధన్ అనే యువకుడిని కత్తితో పొడవడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వర్ధన్ మృతిచెందాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News October 28, 2025
గుంటూరు జిల్లాలో తుపాను ప్రభావం

మంగళగిరి కొత్తపేట, కొలకలూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో సోమవారం మోస్తరుగా వర్షం కురిసింది. తుపానుతో గాలి వేగం పెరిగి, చలి ఎక్కువగా ఉంది. పూరి గుడిసెలు, శిథిల భవనాలు ఖాళీ చేసి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కలెక్టర్ పర్యటనలో ప్రమాదం ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా, ప్రజలు ఇళ్లలో ఉండాలని, అవసరాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
News October 28, 2025
వట్టిచెరుకూరులో భారీ వర్షపాతం నమోదు

‘మొంథా’ తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. మంగళవారం వట్టిచెరుకూరు మండలంలో 19.6 మి.మీ వర్షపాతం నమోదైంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. రైతులు తమ పంటలకు నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
News October 28, 2025
GNT: చందమామ తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు

ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది,”కొకు” గా సుపరిచితుడైన కొడవటిగంటి కుటుంబరావు (1909 అక్టోబర్ 28-1980 ఆగస్ట్ 17) తెనాలిలో జన్మించారు. 50 ఏళ్ల రచనా జీవితంలో 12వేల పేజీలకు మించిన రచనలు చేశారు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించారు.


