News March 8, 2025
తాడేపల్లి: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా ఫైర్

నవమాసాల్లో మహిళలకు నవమోసాలను పరిచయం చేసిన కూటమి ప్రభుత్వానికి మహిళా దినోత్సవం జరిపే అర్హత లేదని రోజా మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణితో కలిసి ఆమె మాట్లాడారు. ఎన్నికలకు ముందు హామీలతో నమ్మించి, అధికారంలోకి రాగానే మొండిచేయి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలోనే మహిళలు నిజమైన సాధికారితను అందుకున్నారన్నారు.
Similar News
News March 9, 2025
GNT: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ముమ్మర ఏర్పాట్లు

ఈనెల 17 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. విభజిత గుంటూరు జిల్లాలో 150 పరీక్షా కేంద్రాల్లో 30,140మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రెగ్యులర్ పరీక్షలతోపాటు, మరో 21 పరీక్షా కేంద్రాల్లో దూర విద్య పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. గుంటూరు గతేడాది 88.14 శాతంతో 16వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని అధికారులు పనిచేస్తున్నారు.
News March 9, 2025
తాడేపల్లి: కాలేజీలో ఘర్షణ.. తీవ్ర గాయాలు

తాడేపల్లి పరిధి వడ్డేశ్వరంలోని ఓ కళాశాలలో శుక్రవారం రాత్రి ఘర్షణ జరిగింది. యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న సంతోష్ అనే యువకుడిని విజయవాడకు చెందిన హరికృష్ణ గ్యాంగ్‌తో కలిసి దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన సంతోష్‌ని విజయవాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.
News March 9, 2025
జాతీయ లోక్ అదాలత్‌కు 49,056 కేసులు పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్‌లో 49,056 కేసులు పరిష్కారం అయినట్టు న్యాయ సేవాధికార సంస్థ జస్టిస్ ధీరత్ సింగ్ ఠాగూర్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తెలహరి, హైకోర్టు న్యాయ సేవ కమిటీ చైర్మన్ రావు రఘునందన్ రావు శనివారం తెలిపారు. రెండో శనివారం హైకోర్టులో, రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో లోకదాలత్ నిర్వహించబడిందన్నారు. రూ.3,260 కోట్లు పరిహారం చెల్లించుటకు అవార్డులు జారీ చేసినట్టు కార్యదర్శి భబిత తెలిపారు.