News March 26, 2025

తాడేపల్లి: పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై సీఎం చంద్రబాబు విచారం

image

హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడారు. చాగల్లులో జరిగే క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు రాత్రి ద్విచక్ర వాహనంపై రాజమండ్రి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Similar News

News February 3, 2026

GNT: 95 సినిమాల్లో 66 చిత్రాలకు సంగీతం ఈయనే

image

తెలుగు చిత్ర పరిశ్రమలో మకుటంలేని మహారాజుగా గుర్తింపు పొందిన ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు చక్రవర్తి గుంటూరు జిల్లా పొన్నెకల్లులో జన్మించారు. ఆయన 1971 నుంచి 1989 వరకు సంగీత రంగాన్ని ఏలారు. 959 సినిమాలకు సంగీతం, దాదాపు 600 చిత్రాలకు డబ్బింగ్ ఇచ్చారు. 1989లో విడుదలైన 95 సినిమాల్లో 66 చిత్రాలకు సంగీతం అందించి ప్రపంచ రికార్డు సృష్టించారు. 2002 ఫిబ్రవరి 3న ఆయన కన్నుమూశారు.

News February 3, 2026

డాక్టర్ ఉమా గవిని.. మహిళా వైద్యులకు నిజమైన నిర్వచనం

image

నేడు జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం సందర్భంగా సేవా నిరతికి ప్రతీకగా నిలిచిన వారిలో గుంటూరుకు చెందిన NRI డాక్టర్ ఉమా గవిని ఒకరు. అమెరికాలో అలర్జీ–ఇమ్యునాలజీ నిపుణురాలిగా పనిచేసిన ఆమె, జీవితకాల సంపాదన రూ.20 కోట్లను GGHలో మాతా–శిశు ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి విరాళం ఇచ్చారు.తన పేరు పెట్టవద్దని కోరడం ఆమె మహత్తర మానవత్వానికి నిదర్శనం.మహిళా వైద్యులు చరిత్ర సృష్టిస్తూ ఈ రోజున ఆమె ఎందరికో స్పూర్తి దాయకం.

News February 3, 2026

గుంటూరు: ఎస్పీ PGRSలో 170 ఫిర్యాదులు

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో మొత్తం 170 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఫిర్యాదులను నిర్ణీత గడువులో పరిష్కరించి, ఫిర్యాది దారులకు సమాచారం అందించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా PGRS కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.