News May 4, 2024
తాడేపల్లి బైపాస్‌లో డ్రగ్స్ కలకలం

తాడేపల్లి బైపాస్‌లో శనివారం డ్రగ్స్ కలకలం రేపాయి. ఓ కాలేజీ విద్యార్థుల నుంచి రూ.5 లక్షల విలువైన 80 గ్రాముల డ్రగ్స్‌ను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డ్రగ్స్ కలిగి ఉన్న విద్యార్థులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 21, 2025
గుంటూరు: పరీక్షల షెడ్యూల్ విడుదల

అచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎం.ఎడ్. నాల్గవ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ ను సోమవారం విడుదల చేసింది. పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు ఉదయం 10:30 నుంచి 1:30 వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. ప్రతి పేపరు 70 మార్కులకు ఉంటుంది. ముఖ్యమైన సబ్జెక్టులుగా టీచర్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, హ్యూమన్ రైట్స్, వాల్యూ ఎడ్యుకేషన్ ఉంటాయి. విద్యార్థులు పరీక్ష తేదీలను గమనించాలని సూచించారు.
News April 21, 2025
వినుకొండ: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

వినుకొండలో క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. శనివారం క్రికెట్ ఆడుతుండగా గౌస్ బాషా (చంటి) అనే యువకుడు గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, కొద్దిసేపటికే మృతి చెందాడు. మూడేళ్ల క్రితమే వివాహమైన చంటి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన స్థానికంగా కలచివేసింది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు భౌతికకాయానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
News April 21, 2025
జర్మన్ యువకుడిని పెళ్లాడిన మంగళగిరి యువతి

మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన మౌనిక జర్మనీలో PHD చేస్తూ ఉద్యోగం చేస్తుంది. అక్కడే పనిచేస్తున్న జర్మన్ యువకుడు ఫాబియన్ డువెన్ బేక్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఇరువురి తల్లిదండ్రుల అంగీకారంతో వీరి వివాహం ఆదివారం పెదవడ్లపూడిలో ఘనంగా జరిగింది. మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ దంపతులు వధూవరులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.