News March 24, 2025
తాడేపల్లి: మహిళ హత్య.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన SP

తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొలనుకొండ వద్ద మహిళను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపిన ప్రాంతాన్ని ఆదివారం రాత్రి గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ పరిశీలించారు. హత్యకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతంచేయాలని, నేరస్థులను గుర్తించి త్వరితగతిన అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సీఐ కల్యాణ్ రాజు ఎస్పీ వెంట ఉన్నారు.
Similar News
News September 12, 2025
ANUలో ఏపీ పీజీ సెట్ విద్యార్థులకు ఇబ్బందులు

ఏపీ పీజీ సెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఆలస్యం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసింది. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులను గురువారం పెదకాకానిలోని నాగార్జున విశ్వవిద్యాలయానికి పిలిచినా, తీరా చివరి నిమిషంలో వాయిదా వేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు నిరాశ చెందగా, అధికారులు కేవలం పేర్లు, హాల్ టికెట్ వివరాలు మాత్రమే నమోదు చేశారు. ఈ నిర్లక్ష్యంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
News September 11, 2025
గుంటూరు జిల్లా కలెక్టర్ నేపథ్యమిదే

తమీమ్ అన్సారియ IAS 2015 బ్యాచ్ ఏపీ కేడర్‌కు చెందిన డైనమిక్ ఇండియన్ IAS అధికారిణి. ఆమె డిసెంబర్ 31, 1998 న తమిళనాడులో జన్మించారు. కంప్యూటర్ సైన్స్, పబ్లిక్ మేనేజ్‌మెంట్‌లో బలమైన విద్యా నేపథ్యం ఉన్న ఆమె 2014లో 17 సంవత్సరాల వయసులో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ 314 ర్యాంక్ సాధించారు. ఆమె భర్త డాక్టర్ మనజీర్ జీలానీ సమూన్ కూడా ఐఏఎస్ అధికారి.
News September 11, 2025
ANUలో ఈ నెల 17న క్విజ్ పోటీలు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 17న క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ రామినేని శివరామప్రసాద్ తెలిపారు. మొదటి మూడు స్థానాలకు వరుసగా రూ.12 వేలు, రూ.9 వేలు, రూ.3 వేల నగదు బహుమతులు అందిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు యూనివర్సిటీ అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని ఆయన కోరారు.