News February 13, 2025
తాడేపల్లి: రేపు కడప వెళ్లనున్న మాజీ సీఎం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739448039829_52008866-normal-WIFI.webp)
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ శుక్రవారం కడప వెళ్లనున్నట్లు పార్టీ సెంట్రల్ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. అక్కడ 11 గంటలకు మేడా రఘునాథ్ రెడ్డి కన్వెన్షన్‌లో ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరు బయలుదేరి వెళతారని తెలిపారు.
Similar News
News February 13, 2025
వైసీపీటీఏ డైరీ ఆవిష్కరించిన వైఎస్ జగన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739452114575_52008866-normal-WIFI.webp)
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ వైఎస్సార్టీఏ అధ్యక్షులు అశోక్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సుధీర్, గౌరవ అధ్యక్షులు జాలిరెడ్డితో పాటుగా 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైసీపీటీఏ డైరీని జగన్ ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యల గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు.
News February 13, 2025
ప్రతిభ కనబరిచిన గుంటూరు పోలీసులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739451181860_60269933-normal-WIFI.webp)
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ కనబరిచిన గుంటూరు పోలీసులను గురువారం జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ అభినందించారు. అనంతపురంలోని పోలీసు ట్రైనింగ్ కాలేజీలో నిర్వహించిన పోటీలలో గుంటూరుకు చెందిన ఏడుగురు పోలీసులు మొత్తం 21 పతకాలు సాధించారు వాటిలో 8 బంగారు పతకాలు ఉన్నాయి. ఆయా పోలీసులకు గురువారం ఎస్పీ సతీశ్ కుమార్ చేతుల మీదగా పతకాలు, ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు.
News February 13, 2025
గుంటూరు: వేసవి తాపాన్ని తీరుస్తున్న పుచ్చకాయలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739419394562_20442021-normal-WIFI.webp)
గుంటూరు జిల్లా వ్యాప్తంగా పుచ్చకాయలు అందుబాటులో ఉన్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనంతో పాటు పోషక విలువ అధికంగా ఉండడంతో వీటి కొనుగోలు కోసం ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. కిలో పుచ్చకాయ ధర రూ.40 నుంచి రూ.45 పలుకుతోంది. ధరలు కాస్తా అధికంగా ఉన్నప్పటికీ ప్రజలు తింటున్నారు. ఎండ వేడిమిని తట్టుకోవడానికి ఇవి ఎంతో మేలు చేస్తాయని ప్రజలు భావిస్తున్నారు. వ్యాపారులు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నారు.