News April 6, 2025
తాడేపల్లి: 8వ అంతస్తు నుంచి పడి వ్యక్తి మృతి

తాడేపల్లిలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్ 8వ అంతస్తు నుంచి ఒక వ్యక్తి కింద పడి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు సదా శివరావుగా గుర్తించారు. ఘనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 13, 2025
గుంటూరు: భక్తిశ్రద్ధలతో చండీహోమం

బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యాన పౌర్ణమి సందర్భంగా శనివారం చండీహోమం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మస్తానయ్య మాట్లాడుతూ.. విశ్వ మానవాళి కోసం శాంతిని కాంక్షిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో 9 మంది వేద పండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించడం జరిగిందన్నారు.
News April 12, 2025
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో పొన్నూరు అమ్మాయి ప్రతిభ

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో పొన్నూరుకు చెందిన విద్యార్థిని సత్తా చాటుకుంది. నాదెండ్ల కృష్ణ ప్రియ అనే విద్యార్థిని ఇంటర్ ఫస్ట్ ఈయర్‌లో 467 మార్కలు సాధించింది. ఆమె ఫాదర్ గవర్నమెంట్ టీచర్‌గా పని చేస్తున్నారు. మంచి మార్కులు రావడంపై తల్లిదండ్రులు, అధ్యాపకులు కృష్ణ ప్రియను అభినందిస్తున్నారు.
News April 12, 2025
ఇంటర్ రిజల్ట్స్.. సత్తా చాటిన ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు

రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించి ఫస్టియర్‌లో గుంటూరు జిల్లా 58 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో 76% ఉత్తీర్ణతతో జిల్లా విద్యార్థులు 2వ స్థానంలో నిలవడం విశేషం. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు సాధించిన ఈ విజయాన్ని అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.