News April 12, 2025

తాడ్‌బండ్ టెంపుల్‌లో హీరోయిన్ ప్రీతి జింటా

image

ప్రముఖ సినీనటి, IPL పంజాబ్ కింగ్స్ జట్టు యజమాని ప్రీతి జింటా తాడ్‌బండ్‌ను సందర్శించారు. హనుమాన్ జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనున్న నేపథ్యంలో ఆమె ఆలయానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె మాస్కు ధరించినట్లు తెలుస్తోంది.

Similar News

News February 1, 2026

తెలంగాణ ఏం తప్పు చేసింది: Dy.CM భట్టి

image

TG: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. బయోఫార్మా అంటే తెలంగాణ గుర్తుకొస్తుందని.. కానీ నిధులు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరెంజ్ ఎకానమీ, స్పోర్ట్స్‌కు తెలంగాణ బిగ్గెస్ట్ సెంటర్ అయినా కేంద్రం విస్మరించిందన్నారు. మూసీ ప్రక్షాళన నిధుల కోసం ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలిసినా ఫలితం లేకపోయిందని.. తెలంగాణ ఏం తప్పు చేసిందని ప్రశ్నించారు.

News February 1, 2026

VZM: ఆప్యాయంగా పలకరించుకున్న బొత్స, పతివాడ

image

మండలి విపక్ష నేత బొత్స సత్యన్నారాయణ, టీడీపీ సీనియర్ నేత పతివాడ నారాయణస్వామి నాయుడు ఆదివారం పూసపాటిరేగలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆప్యాయంగా పలకరించుకున్నారు. బొత్స భుజంపై పతివాడ చేయి వేసి స్నేహపూర్వకంగా పలకరించారు. కాసేపు సరదాగా ముచ్చటించుకుంటూ పరస్పర ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు. రాష్ట్రమంతా రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మన జిల్లాలో మాత్రం రాజకీయాలు హుందాగా సాగుతున్నాయి.

News February 1, 2026

ఉద్యోగాలు లేవు.. రైతులకు ఊరట లేదు: రాహుల్ గాంధీ

image

కేంద్ర బడ్జెట్-2026పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ X వేదికగా మండిపడ్డారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను ఈ బడ్జెట్ పట్టించుకోలేదని రాసుకొచ్చారు. ‘యువతకు ఉద్యోగాలు లేవు. తయారీ రంగం కుదేలైంది. పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నారు. సామాన్యుల పొదుపు తగ్గిపోతోంది. రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారు’ అని ఆరోపించారు. సంక్షోభాలను పరిష్కరించే దిశగా బడ్జెట్‌లో ఎలాంటి ప్రయత్నం చేయలేదని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.