News August 7, 2024
తాడ్వాయి: ‘గ్రామపంచాయతీ సిబ్బందిని కాపలాగా పెట్టాలి’
తాడ్వాయి మండలంలో మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. దీంతో మండలంలోని నార్లాపూర్-పడిగాపూర్ గ్రామాల మధ్య ఉన్న జంపన్నవాగు భారీగా ప్రవహిస్తుండటంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన ములుగు డీఎంహెచ్‌వో అప్పయ్య జంపన్న వాగును పరిశీలించారు. జంపన్నవాగు వద్ద గ్రామపంచాయతీ సిబ్బందిని కాపలా పెట్టాలని గ్రామపంచాయతీ కార్యదర్శి ధర్మేందర్‌ను ఆదేశించారు.
Similar News
News November 27, 2024
విజయోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి: ములుగు కలెక్టర్
ప్రజా పాలన, విజయోత్సవాల కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ములుగు కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన, విజయయోత్సవ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ఈనెల 29న స్థానిక డిఎల్ఆర్ గార్డెన్‌లో విజయోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు.
News November 27, 2024
వరంగల్: పెరిగిన పత్తి ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర పెరిగింది. సోమవారం క్వింటా కొత్త పత్తి ధర రూ.6,860 పలకగా. మంగళవారం రూ.6,770కి పడిపోయింది. బుధవారం రూ.70 పెరిగి రూ. 6,840 అయింది. మార్కెట్లో ధరలు పెరుగుతూ తగ్గుతుండడంతో రైతన్నలు అయోమయానికి గురవుతున్నారు. ధరలు పెరిగేలా చూడాలని కోరుతున్నారు.
News November 27, 2024
చలి తీవ్రతతో వణుకుతున్న ఓరుగల్లు!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో చలి ప్రభావ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా ములుగు, భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో చలి జ్వర పీడితులు పెరుగుతున్నారు. చిన్నారులు, వయో వృద్ధుల్లో జ్వరం, జలుబు, దగ్గు, ఆస్తమా వంటివి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.