News October 6, 2024
తాడ్వాయి: గ్రేట్.. మూడు ఉద్యోగాలు సాధించాడు.!
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన డీఎస్సీ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన భూంపల్లి రాజశేఖర్ మూడు ఉద్యోగాలు సాధించాడు. SA సోషల్, SA తెలుగు, ఎస్జీటి గురుకుల టీజీటీ పోస్టులు సాధించాడు. దీంతో తల్లిదండ్రులు తమ కుమారుడు పలు ఉద్యోగాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్థులు, మిత్రులు సంతోషం వ్యక్తం చేస్తూ రాజశేఖర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News December 30, 2024
క్రైమ్ రేటుపై చర్చకు సిద్ధం: మోహన్ రెడ్డి
ఉనికి కోసమే కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత అబద్ధపు మాటలు చేస్తున్నారని రాష్ట్ర సహకార యునియన్ లిమిటెడ్ ఛైర్మన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. మాయ మాటలు చెప్పడంలో కేసీఆర్ కుటుంబాన్ని మించిన వారు రాష్ట్రంలో లేరని వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వ హయంలో క్రైమ్ రేట్ పెరిగిందో, తగ్గిందో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మీరు సిద్ధమైతే మాతో చర్చకు రావాలని సవాల్ చేశారు. ఇచ్చిన హామీల్లో 80% అమలు చేశామన్నారు.
News December 30, 2024
ప్రజల ఇళ్లపైకి బుల్డోజర్లను తీసుకెళ్తే ఊరుకోం: MLC కవిత
ప్రజల ఇళ్లపైకి బుల్డోజర్లను తీసుకెళ్తే ఊరుకోబోమని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో హైడ్రా పెట్టినట్టు నిజామాబాద్‌లో నిడ్రా పెడుతామని పీసీసీ అధ్యక్షుడు చెప్పడం దారుణమన్నారు. బుల్డోజర్‌తో ప్రజల ఆస్తులు కూలగొడుతామని హెచ్చరిస్తున్నారని, దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆమె పేర్కొన్నారు.
News December 30, 2024
దేశమంతటికీ ఆమె గర్వకారణంగా నిలిచింది: MP అర్వింద్
భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపి ఫీడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చేస్ ఛాంపియన్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోనేరు హంపీకి ‘X’ వేదికగా అభినందనలు తెలిపారు. ఈ వేదికగా ఆమె ఫోటోను జోడించిన ఎంపీ అర్వింద్ ఈ అపూర్వ విజయంతో ఆమె దేశమంతటికీ గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించారు.