News February 4, 2025

తాడ్వాయి: బస్సులోనే గుండెపోటుతో మృతి

image

బస్సులో ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. నార్లాపూర్ గ్రామానికి చెందిన పల్లపు శంకరమ్మ (56) అనే మహిళ నార్లాపూర్ నుంచి పస్రా వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన కొద్దిసేపటికే గుండెపోటుతో బస్సులోనే మృతి చెందింది. పక్కన కూర్చున్న వారు గమనించి బస్సు కండక్టర్‌కు తెలుపగా బస్సును నిలిపి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Similar News

News February 4, 2025

స్టేషన్ ఘనపూర్: మంటల్లో కాలిన రూ.25 లక్షల నగదు!

image

స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో మల్లయ్య, కృష్ణమూర్తికి చెందిన రూ.25 లక్షల నగదుతో పాటు అప్పు పత్రాలు, బియ్యం బస్తాలు, ఐలయ్యకు చెందిన రూ.5 లక్షల విలువైన టెంటు సామగ్రి మంటల్లో కాలి బూడిద అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

News February 4, 2025

గీసుగొండ సీఐ హెచ్చరిక

image

సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపులలో వివాదాస్పదంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టుకుంటున్న విషయం తమ దృష్టికి రాగా వారిని గీసుగొండ తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు సీఐ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 3, 2025

విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రణాళిక: కలెక్టర్

image

పీఎంశ్రీ పథకం ద్వారా ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీసీ సమావేశ మందిరంలో పీఎం శ్రీ పథకం కింద జిల్లాలో ఎంపికైన 16 ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లతో మంజూరైన నిధులు, చేసిన వివిధ అభివృద్ధి పనులు తదితర అంశాలపై చర్చించారు.