News March 12, 2025
తాత్కాలికంగా ఆ రైలు అనంతపురం వరకే!

నంద్యాల మీదుగా ప్రయాణించే మచిలీపట్నం-ధర్మవరం(17215), ధర్మవరం-మచిలీపట్నం (17216) రైలు తాత్కాలికంగా అనంతపురం-ధర్మవరం మధ్య రద్దు చేశారు. ధర్మవరంలోని ప్లాట్ ఫాం నంబర్ 5పై జరుగుతున్న మరమ్మతుల కారణంగా ఈ నెల 12 నుంచి 30వ తేదీ వరకు ఈ రైలు మచిలీపట్నం నుంచి అనంతపురం వరకు మాత్రమే ప్రయాణిస్తుందన్నారు. అలాగే ఈనెల 13 నుంచి 31వ తేదీ వరకు ఈ రైలు అనంతపురం నుంచే బయలుదేరి మచిలీపట్నం వెళ్తుంది.
Similar News
News November 11, 2025
నారాయణ పేట: ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

నారాయణపేట పట్టణంలోని మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలలో పీజీటీ ఉర్దూ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అబ్దుల్ అలీం ఉమ్మడి జిల్లా మైనారిటీ గురుకులాల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికయ్యారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ఎల్‌సి ఖాజా బహుద్దీన్.. అబ్దుల్ అలీంను సన్మానించి, జ్ఞాపికను అందించారు. పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
News November 11, 2025
ఖమ్మం: వీధి కుక్కలకు వింత వ్యాధులు

జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కలు ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాయి. అన్ని మండలాల్లో కుక్కల చర్మంపై భయంకరమైన మచ్చలు ఏర్పడి దయనీయ స్థితిలో కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువైద్యాధికారులు వెంటనే స్పందించి, కుక్కలకు సోకిన ఈ వ్యాధిని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
News November 11, 2025
బిహార్ ఎలక్షన్స్: ALL TIME RECORD

బిహార్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు నమోదయింది. ఫేజ్-1(65.08%), ఫేజ్-2(68.76%) కలిపి ఈసారి మొత్తం 66.91% ఓట్లు పోలయ్యాయి. 1951లో తొలి ఎలక్షన్ జరిగినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. మహిళల ఓటింగ్‌లోనూ ఈసారి రికార్డు స్థాయిలో 71.6% ఓటింగ్ నమోదైంది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 14న వెలువడనుండగా ఎగ్జిట్ పోల్స్ NDAకే విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేశాయి..


