News March 19, 2025

తానా మహాసభలకు మంత్రి సవితకు ఆహ్వానం

image

అమెరికాలోని మిచిగన్‌లో తానా ఆధ్వర్యంలో జరిగే తెలుగు మహా సభలకు మంత్రి ఎస్. సవితను ఆహ్వానించారు. తానా సంస్థ ప్రతినిధులు బుధవారం అమరావతిలోని అసెంబ్లీలో మంత్రి సవితను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ ఏడాది జులై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మూడ్రోజులపాటు, తానా తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఇందుకు మంత్రి సవిత సానుకూలంగా స్పందించారు. తానా మహాసభలకు హాజరుకానున్నట్లు తెలిపారు.

Similar News

News March 19, 2025

ALERT: రేపు 59 మండలాల్లో వడగాలులు

image

AP: రాష్ట్రంలోని 59 మండలాల్లో రేపు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం-15, విజయనగరం-20, మన్యం-14, అల్లూరి-2, కాకినాడ-3, తూర్పుగోదావరి జిల్లాలోని 5 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. మరోవైపు రాష్ట్రంలోనే అత్యధికంగా ఇవాళ నంద్యాల జిల్లా చాగలమర్రిలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా అట్లూరులో 41.2, ప్రకాశం జిల్లా గోళ్లవిడిపిలో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 19, 2025

అర్హత గల వారికి రుణాలు మంజూరు చేయాలి: కలెక్టర్

image

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వివిధ అంశాల్లో లక్ష్యానికి అనుగుణంగా అర్హత గల వారికి రుణాలు మంజూరు చేయాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో వివిధ బ్యాంకు అధికారులు, మేనేజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా ప్రాధాన్యత రంగాల్లో రుణాలను పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం నాబార్డ్ సిద్ధం చేసిన ప్లాన్‌ను ఆయన ఆవిష్కరించారు.

News March 19, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤హత్తిబెళగల్ వీఆర్వోపై కర్నూలు జేసీ నవ్య ఆగ్రహం ➤ కూటమి ప్రభుత్వంపై ఆలూరు ఎమ్మెల్యే ఫైర్ ➤ జగన్, కేసీఆర్ తోడు దొంగలు, ఆర్థిక నేరగాళ్లు: బైరెడ్డి ➤ లంచం కోసం ఎస్ఐ అరాచకం.. మంగళసూత్రం తాకట్టు పెట్టించి..! ➤ కోడుమూరు: వైసీపీ నాయకుడి మృతి ➤ ప్రజల మనసులో నుంచి వైఎస్ఆర్‌ను తొలగించలేరు: ఎస్వీ ➤ ప్రభుత్వాసుపత్రిలో అన్ని వైద్య సేవలు అందించాలి: ఆదోని ఎమ్మెల్యే

error: Content is protected !!