News February 22, 2025

తానూర్: ఉరేసుకొని గర్భిణీ ఆత్మహత్య

image

మనస్తాపం చెంది గర్భిణీ ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం తానూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బోల్సా గ్రామానికి చెందిన 3నెలల గర్భిణీ నవనీత(22)ను భర్త రాకేశ్ అక్క ఇంట్లోని శుభకార్యానికి తీసుకెళ్లలేదు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. తండ్రి బక్కన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News February 22, 2025

ఇదే రికార్డు.. భార్యకు రూ.380 కోట్లు భరణం!

image

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడిపోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఓ సెలబ్రిటీ భరణం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. చాహల్ రూ.60 కోట్లు భరణంగా ఇవ్వనున్నారని వార్తలు రాగా ధనశ్రీ ఫ్యామిలీ ఖండించిన విషయం తెలిసిందే. అయితే, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ 2014లో తన భార్య సుస్సేన్‌కు రూ.380 కోట్ల భరణం ఇచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇండియన్ సెలబ్రిటీల్లో ఇప్పటివరకూ ఇదే అత్యధికమని చెబుతున్నాయి.

News February 22, 2025

విశాఖలోని 16 సెంటర్లలో గ్రూప్-2 పరీక్ష: జేసీ

image

విశాఖ జిల్లాలో 16 ఎగ్జామ్స్ సెంటర్లలో రేపు గ్రూప్-2 పరీక్ష నిర్వహించనునట్లు జాయింట్ కలెక్టర్ మాయూర్ అశోక్ తెలిపారు. ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్ -2 పరీక్ష ఉండనుందన్నారు. పరీక్షా సమయానికి 15 నిమిషాలు ముందుగా అభ్యర్థులు ఎగ్జామ్స్ సెంటర్లకు హాజరు కావాలన్నారు. విశాఖ జిల్లాలో మొత్తం 16 కేంద్రాలలో 11,029 అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు.

News February 22, 2025

నూజివీడు: తల్లి మందలించిందని విద్యార్థి ఆత్మహత్య

image

నూజివీడు పట్టణ పరిధిలోని బాపునగర్ రోడ్డులో గల పాలిటెక్నిక్ విద్యార్థిని బట్ర వెంకట రమ్య (18) శనివారం ఇంటిలోని దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకొని రమ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాలేజీకి వెళ్లలేదని తల్లి మందలించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!