News February 12, 2025
తానూర్: రూ.5.70లక్షల నగదు పట్టివేత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739331346636_50048514-normal-WIFI.webp)
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తానూర్ మండల సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద మంగళవారం రూ.5.70లక్షల నగదు సాధనం చేసుకున్నట్లు ఏఎస్ఐ శ్యాముల్ తెలిపారు. కరీంనగర్ నుంచి మహారాష్ట్రలోని బోకర్‌కు వెళ్తున్న బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా నగదు పట్టుబడినట్లు వెల్లడించారు. నగదుకు సంబంధించి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశామన్నారు.
Similar News
News February 12, 2025
జేఈఈ మెయిన్‌లో బాన్సువాడ విద్యార్థి ప్రతిభ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739338360478_51869222-normal-WIFI.webp)
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని సంగమేశ్వర కాలనీకి చెందిన అభినయ్ ఇటీవల ప్రకటించిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో 99.84 శాతం సాధించి అత్యుత్తమ ప్రతిభకనబరిచారు. ఈ సందర్భంగా బుధవారం విద్యార్థికి కాలనీవాసులు అభినందనలు తెలిపారు. అభినయ్ మాట్లాడుతూ.. ఈ ప్రతిభ కనబర్చడానికి చాలా కష్టపడ్డానన్నారు.
News February 12, 2025
అక్రమం ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు: వరంగల్ సీపీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739345097458_50199223-normal-WIFI.webp)
ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులను అదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపేందుకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు సన్నద్ధమాయ్యారు. ఇందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామ శివారులోని ఇసుక ర్యాంపులను పరిశీలించారు.
News February 12, 2025
‘కిల్’ డైరెక్టర్‌తో రామ్ చరణ్ సినిమా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739324155893_893-normal-WIFI.webp)
బాలీవుడ్‌లో గత ఏడాది ‘కిల్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్. ఆయన తన తర్వాతి సినిమాను రామ్‌చరణ్‌తో చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.