News November 17, 2025

తారా కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు

image

సంగారెడ్డిలోని తారా పీజీ కళాశాలలో పీజీ కోర్సుల్లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. వివిధ కోర్సుల్లో మొత్తం 285 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆంగ్లంలో 27, తెలుగులో 21, రాజనీతి శాస్త్రంలో 37, ఎం.కాం.లో 26, బోటనీలో 22, కంప్యూటర్ సైన్స్‌లో 47, ఫిజిక్స్‌లో 46, మ్యాథమెటిక్స్‌లో 47, జువాలజీలో 12 సీట్లు ఉండగా అర్హులు ఈ నెల 18లోగా అప్లయి చేసుకోవాలన్నారు.

Similar News

News November 17, 2025

హైదరాబాద్ బస్తీలకు కదిలే అంగన్వాడీలు!

image

కదిలే గ్రంథాలయం, మూవింగ్ ఫుడ్ కోర్ట్ విన్నాం కానీ.. కదిలే అంగన్ వాడీ కేంద్రం విన్నారా..? లేదు కదా..! త్వరలో చూస్తారు కూడా. నగరంలోని పలు బస్తీలు, కాలనీల్లో మూవింగ్ అంగన్‌‌వాడీ కేంద్రాల ద్వారా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 37 అధునాతన వాహనాలను కూడా సిద్ధం చేసిందని సమాచారం. అంగన్‌వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య సలహాలు ఇస్తారు.

ఇతిహాసాలు క్విజ్ – 69 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: శివుడికి ‘నీలకంఠుడు’ అని ఎందుకు అంటారు?
సమాధానం: పాల సముద్రాన్ని మథించేటప్పుడు భయంకరమైన విషం వెలువడింది. దాన్ని హాలాహలం అని అంటారు. సమస్త లోకాల సంరక్షణ కోసం శివుడు ఆ విషాన్ని తన కంఠంలో (గొంతులో) ఉంచుకుంటాడు. అందువల్ల ఆయన గొంతు నీలం రంగులోకి మారింది. అలా శివుడు నీలకంఠుడు అయ్యాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>