News October 14, 2025
తార్నాక మౌలిక ఆత్మహత్య కేసులో అంబాజి అరెస్ట్

HYD తార్నాకలోని కాలేజీ విద్యార్థిని మౌలిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు అంబాజీ నాయక్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ట్రైన్‌లో అదుపులోకి తీసుకున్నారు. అంబాజీ నాయక్ పాత ఫోన్‌లో మౌలికను వేధిస్తూ చేసిన మెసేజ్‌ల డేటా ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News October 14, 2025
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌తో కలెక్టర్ సమావేశం

ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా స్థాయి పారిశ్రామిక భద్రతా కమిటీ క్రైసిస్ గ్రూపుల కమిటీ సమావేశాన్ని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్, సేఫ్టీ అధికారులతో కలసి కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లాలో కేటగిరీల వారీగా 36 పరిశ్రమలు మీద భద్రత ప్రమాణాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి ఫ్యాక్టరీలో ఎస్ఓను ఏర్పాటు చేయాలన్నారు.
News October 14, 2025
పెద్దపల్లి: ‘ఉపాధ్యాయులు అవగాహన కలిగి ఉండాలి’

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష కలెక్టరేట్‌లో మంగళవారం ఉపాధ్యాయుల శిక్షణలో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో థింక్- పేర్-షేర్ విధానం అమలు ద్వారా మౌనంగా, ఇన్‌యాక్టివ్‌గా ఉన్న విద్యార్థుల్ని బోధనలో భాగస్వామ్యం చేసేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. విధానంపై ఉపాధ్యాయులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, సందేహాలు శిక్షణలో నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
News October 14, 2025
మెరుగైన బోధన అందించేందుకు చర్యలు: నిర్మల్ కలెక్టర్

ఉప ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడారు. జిల్లాలో ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ పథకం కింద చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించనున్నామని వెల్లడించారు. సంబంధిత శాఖల అధికారులు ఈ పథకం అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె ఆదేశించారు.