News February 28, 2026

తాలిబన్ల పవర్: ఎయిర్ ఫోర్స్ లేకుండానే పాక్ గుండెలపై దాడి.. ఎలా?

image

సరిహద్దు నుంచి 200km దూరంలో ఉన్న ఇస్లామాబాద్‌పై తాలిబన్లు దాడులు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సరైన శిక్షణ లేని సైన్యం అంత లోపలికి వెళ్లగలగడానికి అమెరికా వదిలి వెళ్లిన అడ్వాన్స్‌డ్ డ్రోన్ టెక్నాలజీయే కారణం. ముఖ్యంగా నిఘా, అటాక్స్‌కు ఉపయోగించే UAVల ద్వారా వారు పాక్ ఎయిర్ డిఫెన్స్‌ను తప్పించుకోగలిగారు. తక్కువ వనరులున్నప్పటికీ కచ్చితమైన ఇంటెలిజెన్స్‌తో పాక్‌పై డ్రోన్ ఆపరేషన్లను నిర్వహించారు.

Similar News

News February 28, 2026

SSC CHSL టైర్-1 ఫలితాలు విడుదల

image

CHSL టైర్-1(2025) పరీక్ష ఫలితాలను SSC విడుదల చేసింది. <>https://ssc.gov.in/<<>>లో ఎంపికైన వారి జాబితాను చెక్ చేసుకోవచ్చు. 3,131 ఉద్యోగాలకు నవంబర్ 12 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. వీటికి దేశవ్యాప్తంగా లక్షలాది అభ్యర్థులు హాజరయ్యారు. LDC/JSA/క్లర్క్ కమ్ టైపిస్ట్, DEO(సైన్స్ స్ట్రీమ్) ఉద్యోగాలున్నాయి.

News February 28, 2026

IND-EU మధ్య మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా!

image

ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(FTA) కుదుర్చుకొన్న <<18973975>>భారత్-ఈయూ<<>> మరో అడుగు ముందుకేశాయి. ఈ డీల్ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఐదేళ్లపాటు ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాను ఇచ్చుకునేందుకు అంగీకరించాయి. దీని ప్రకారం IND లేదా EU వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(WTO) దేశాలతో మెరుగైన డీల్ చేసుకుంటే.. దాన్ని ఈ రెండు దేశాలకూ వర్తింపజేసుకుంటాయి. కాగా India-EU ట్రేడ్ డీల్‌ను ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా అభివర్ణిస్తున్న విషయం తెలిసిందే.

News February 28, 2026

BELలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL), ఘజియాబాద్‌లో 6 సెక్యూరిటీ, డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి టెన్త్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో పనిచేసిన అనుభవం గలవారు మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్/రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/