News April 5, 2024
తాళ్లపల్లి : విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి

విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మాచర్ల మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన శీలం శ్రీను (50) ఉదయాన్నే రైట్ కెనాల్ పక్కనే ఉన్న మరసకుంట వద్దకు బహిర్భూమికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు పొలానికి నీరు పెట్టే విద్యుత్ మోటారు వైరు తగిలి కరెంటు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విజయపురి సౌత్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 18, 2025
GNT: ఈ సీజన్‌కి అయినా యార్డ్ ఛైర్మన్ పోస్ట్ భర్తీ అయ్యేనా?

గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్ విషయంలో ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. వచ్చే నెల నుంచి ప్రారంభమవనున్న మిర్చి సీజన్లో యార్డులో కోట్ల రూపాయల లావాదేవీలు జరగనున్నాయి. ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇంకా ఛైర్మన్ పదవిని భర్తీ చేయకపోవడంతో సొంత పార్టీ నాయకులే నైరాశ్యంలో ఉన్నారని పలువురు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఆశావహులు మాత్రం ఈ సీజన్‌కి పదవి భర్తీ ఉంటుందని ఆశిస్తున్నారు.
News December 18, 2025
ANU: బీ ఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో సెప్టెంబర్ నెలలో జరిగిన బీ ఫార్మసీ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు గురువారం విడుదల చేశారు. II, IV 4వ సెమిస్టర్, lll, lV 6వ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం ఈనెల 30వ తేదీ లోపు రూ.2,070 నగదు చెల్లించాలన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్
https://www.nagarjunauniversity.ac.in/ ను సంప్రదించాలన్నారు.
News December 18, 2025
GNT: 7,000 పైగా పాటలు పాడిన గొప్ప గాయకుడు

తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు మాధవపెద్ది సత్యం (మార్చి 11, 1922 – డిసెంబర్ 18, 2000) ఉమ్మడి గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరులో జన్మించారు. ప్రసిద్ధమైన పాటలు అయ్యయో జేబులో డబ్బులు పోయెనే, మాయాబజార్ సినిమాలోని వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఈయన మధురకంఠము నుంచి జాలువారినవే. ఈయన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడారు.


