News October 19, 2025
తాళ్లపూడిలో నేటి చికెన్ ధరలు ఇలా!

తాళ్లపూడి మండల వ్యాప్తంగా చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో కిలో చికెన్ కిలో రూ.200 – 220 మధ్య విక్రయిస్తున్నారు. నాటుకోడి కిలో రూ.600, మేక మాంసం కిలో రూ.800 వద్ద అమ్మకాలు జరిగాయి. మరో నాలుగు రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం కావడం, స్వామి మాలధారులు పెరగడంతో వచ్చే వారం చికెన్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
Similar News
News January 8, 2026
బ్లో అవుట్ వివరాలు సీఎంకు తెలిపిన ఎంపీ హరీష్

ఇరుసుమండ గ్యాస్ లీకేజీ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీ హరీశ్ బాలయోగిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలవరం పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న క్రమంలో విమానాశ్రయంలో కలిసిన ఎంపీని ఘటన తీవ్రతను అడిగారు. త్వరలోనే బ్లో అవుట్ ప్రాంతాన్ని సందర్శించి, ఏరియల్ సర్వే నిర్వహిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు హరీశ్ తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
News January 7, 2026
సంక్రాంతికి నిడదవోలు నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు: DM

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని నిడదవోలు ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ధనుంజయ్ తెలిపారు. ఈనెల 8 నుంచి 18వ తేదీ వరకు నిడదవోలు – విజయవాడ మార్గంలో నాలుగు ప్రత్యేక సర్వీసులను అందుబాటులో ఉంచామన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రధాన ప్రాంతాలకు సర్వీసులను ఏర్పాటు చేస్తామని, ఈ సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News January 7, 2026
దూబచర్లలో విషాదం.. బైకును ఢీకొట్టి పరార్

నల్లజర్ల మండలం దూబచర్లలో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. బైకుపై వెళ్తున్న వ్యక్తిని అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం బలంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బైకిస్టు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం అనంతరం డ్రైవర్ వాహనంతో సహా పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.


