News December 26, 2024
తాళ్లపూడి: కాలువలో మునిగి బాలుడి మృతి
తాళ్లపూడి మండలం బల్లిపాడులో నాలుగేళ్ల బాలుడు కాలువలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల కథనం మేరకు గురువారం బల్లిపాడు ఎస్సీ నివాసిత ప్రాంతంలో కాలువ గట్టున బాలుడు ఆడుకుంటూ కాలువలో పడ్డాడు. ఎవరూ గమనించకపోవడంతో మృతి చెందాడని తెలిపారు. తల్లి ఝాన్సీ రాణి రోదన చూపరులకు కన్నీరు తెప్పించింది.
Similar News
News December 27, 2024
రేపు కాకినాడకు రానున్న సినీ నటులు
ప్రముఖ సినీ నటుడు, విక్టరీ వెంకటేశ్ శనివారం కాకినాడలో ఓ ప్రైవేట్ ఛానల్ నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలు ఉత్సవంలో పాల్గొననున్నారు. పీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో జరగనున్న సంక్రాంతి సంబరాల్లో వెంకటేశ్‌తోపాటు సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, ఆమని, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి పాల్గొననున్నారు. సినీ నటుల రాక కోసం స్థానికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News December 27, 2024
కోరుకొండ: స్కూల్ బస్సు కింద నలిగిన చిన్నారి జీవితం
LKG చదువుతున్న గీతాన్స్ (5)ను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి శైలజతోపాటు వచ్చిన చెల్లి హన్సిక చౌదరి (3) అదే స్కూలు బస్సు చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన కోరుకొండ మండలం రాఘవపురంలో గురువారం జరిగింది. అల్లారు ముద్దుగా తనతో మాట్లాడిన మాటలే చెల్లె చివరి మాటలని తెలిసి గీతాన్స్ తల్లడిల్లిపోయాడు. తనతోపాటు హన్సిక వచ్చిన విషయాన్ని ఆ తల్లి గమనించలేదు. అదే చిన్నారి మృతికి కారణమైంది.
News December 27, 2024
తూ.గో: ఒక్కరోజే 8 మంది మృతి.. వివరాలివే
తూ.గో.జిల్లాలో నిన్న జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో 2 చిన్నారులు, 3 యువకులు, 3వృద్ధులు ఉన్నారు. వివరాలు ఇవే..
కోరుకొండ(M)రాఘవాపురం- హన్సిక
తాళ్లపూడి (M)బల్లిపాడు- అద్విత్ కుమార్
శంఖవరం(M)పెదమల్లాపురం- వెంకటరమణ, సుబ్రహ్మణ్యం
రాజానగరం(M)జి.యర్రంపాలెం- ప్రేమకుమార్
సామర్లకోట(M)గంగనాపల్లి- రాంబాబు(59)
ముమ్మడివరం(M)కొమనాపల్లి- పల్లయ్య
కొత్తపేట(M)బిళ్లకర్రు- వెంకటరమణ