News February 26, 2025

తాళ్లపూడి: గల్లంతై చనిపోయింది వీరే..!

image

తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామం పండగ రోజు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నదీ స్నానానికి దిగిన 11 మందిలో ఐదుగురు గల్లంతై చనిపోయారు. మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. 20 సంవత్సరాలు దాటకుండానే ఆ యువకులు చనిపోయారు. మృతదేహాల వద్ద వారి కుటుంబసభ్యులు రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. ఆల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 

Similar News

News July 5, 2025

గ్రేట్.. 5వేల మందికి ఉచితంగా ప్రసవాలు

image

చదువుకోకపోయినా రూపాయి తీసుకోకుండా ఇప్పటివరకూ 5వేల ప్రసవాలు చేశారు రాజస్థాన్‌ అజ్మీర్‌కు చెందిన 80ఏళ్ల సువా దై మా. దాదాపు 50 ఏళ్లుగా 6 గ్రామాల ప్రజలకు ప్రాథమిక వైద్యం అందిస్తున్నారు. తన అనుభవం, జ్ఞానంతో మహిళ నాడిని చెక్ చేసి గర్భధారణను ఆమె నిర్ధారిస్తుంటారు. తుఫానులొచ్చినా, అర్ధరాత్రైనా, కరెంట్ లేకున్నా ప్రసవాలు చేసేందుకు ముందుంటారు. ఆమె డబ్బును తీసుకోకుండా ఆశీర్వాదాలను మాత్రమే అంగీకరిస్తుంటారు.

News July 5, 2025

HYD: ప్రైవేటు బడి పుస్తకాలతో.. భుజం బరువెక్కుతుంది.!

image

HYDలో కొన్ని ప్రైవేటు పాఠశాలల వ్యవహారంతో బడి పుస్తకాలు మోతకోలుగా మారుతున్నాయి. పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, ప్రాక్టీస్ నోట్స్, సబ్జెక్టు మెటీరియల్ ఇలా రకరకాల పేర్లతో పిల్లల భుజాలకు కిలోల బరువును వేలాడేస్తున్నారు. దీంతో పిల్లల భుజం బరువెక్కుతోంది. సాధారణంగా ప్రభుత్వం పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలు, నోట్స్ సరిపోతుంది. మరీ మీ పిల్లల పరిస్థితి ఎలా ఉంది.

News July 5, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.