News January 27, 2025

తాళ్లరేవు: చనిపోయి మరో ఇద్దరికి చూపునిచ్చిన మహిళ

image

ప్రముఖ దినపత్రికలో తాళ్లరేవు మండల విలేకరిగా వూడా వెంకటరమణ పనిచేస్తున్నారు. ఆయన సతీమణి హేమవతి(45) ఆదివారం మృతి చెందారు. ఈ మేరకు వెంకటరమణ తన శ్రీమతి నేత్రాలను కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంకుకు దానమిచ్చారు. చనిపోయి ఆమె ఇద్దరికి చూపునిచ్చిందని మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద అభినందించారు. సతీ వియోగంతో బాధపడుతున్న విలేకరి వెంకటరమణను తాళ్లరేవు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పరామర్శించారు.

Similar News

News January 27, 2025

SKLM: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం: కలెక్టర్

image

లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ఫలితాలు వెల్లడించడం నేరమని జిల్లా స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ సలహా మండలి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఆడపిల్లల తక్కువ జననాలు సరుబుజ్జిలి, బూర్జ, ఆమదాలవలస, హిరమండలం, సంతబొమ్మాళి మండలాల్లో నమోదవుతున్నాయని వెంటనే ఆయాచోట్ల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.

News January 27, 2025

జనగామ జిల్లాలో రైతులకు రూ.15.91 కోట్లు జమ

image

జనవరి 26న రైతుభరోసా పథకం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి రూ.6 వేలు చొప్పున అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు జనగామ జిల్లా వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. సోమవారం ఈ మేరకు రైతు భరోసా నిధులు జిల్లాలో ప్రతి మండలానికి ఒక్కో గ్రామం చొప్పున జనగామ జిల్లాలో 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 12,320 రైతులకు రూ.15.91 కోట్లు జైనట్లు తెలిపారు.

News January 27, 2025

పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు: ఎస్పీ

image

ఉద్యోగ సాధనలో పట్టుదల ఉంటే సాధ్యంకానిది ఏదీ లేదని అనంతపురం ఎస్పీ జగదీశ్ అభిప్రాయపడ్డారు. కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో అర్హత సాధించి మెయిన్స్‌కు ఎంపికైన ఎస్కేయూ విద్యార్థులు 150 మందికి, జిల్లా హోమ్ గార్డులు 20 మందికి ఎస్పీ చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ అందించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పట్టుదల, అంకిత భావంతో ఏదైనా సాధించవచ్చని అన్నారు.