News February 12, 2026
తాళ్లరేవు: పోలీసుల్ని చూసి భయం.. యాక్సిడెంట్.. బీటెక్ విద్యార్థిని మృతి

తాళ్ళరేవు సుంకరపాలెం జంక్షన్ సమీపంలోని ఎక్సైజ్ చెక్‌పోస్ట్ మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యానాంకు చెందిన పైడా కాలేజీ బీటెక్ విద్యార్థిని మహమ్మద్ మోమిన్ (22) మృతి చెందింది. హాల్ టికెట్ తీసుకుని స్కూటీపై ఇంటికొస్తున్న సమయంలో పోలీసుల్ని చూసి భయపడి అతి వేగంతో వెళ్తూ బస్సుని ఢీకొట్టారు. ప్రమాదంలో మోమిన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆమెతో ఉన్న మరో యువతి గాయాలతో బయటపడ్డారు. కేసు నమోదైంది.
Similar News
News February 20, 2026
4,000 నుంచి 550కి ఓలా స్టోర్లు

<<19145931>>మార్కెట్ వాటా<<>>తో పాటు డిమాండ్ తగ్గడంతో ఓలా ఎలక్ట్రిక్ తన ఫిజికల్ స్టోర్ల సంఖ్యను తగ్గించుకుంటోంది. గతంలో ఏకంగా 4,000 ఔట్‌లెట్లు ఉండగా మార్చి నాటికి 550కి తగ్గించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 700 స్టోర్లు రన్ అవుతున్నాయి. సర్వీస్ క్వాలిటీని పెంచడం, ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ ‘బిజినెస్ రీసెట్’ చేపట్టింది. డిసెంబర్ క్వార్టర్‌లో కంపెనీ ఆదాయం 55% తగ్గింది. నష్టాలు ₹487Crగా నమోదయ్యాయి.
News February 20, 2026
NZB: నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల ఆరాటం

మార్చి15లోగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించడంతో ఆశావహుల్లో ఆరాటం మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అసంతృప్తులకు, రెబల్స్‌కు నామినేటెడ్ పోస్టులు, జిల్లా కమిటీల్లో పార్టీ పదవుల భర్తీలో ప్రాధాన్యం ఇస్తామన్న హామీలు, భరోసాను కల్పించారు. ఈ నేపథ్యంలో భర్తీ ప్రకటన వెలువడడంతో వారిలో ఆశలు మొదలయ్యాయి. కాగా DCCB ఛైర్మన్ పదవిని పురన్ రెడ్డికి ఖరారు చేసినట్లు సమాచారం.
News February 20, 2026
జగిత్యాల: జీవన్ రెడ్డికి అస్వస్థత..!

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే HYD KIMS ఆస్పత్రికి తరలించారు. కాగా, జీవన్ రెడ్డి నిన్న రాత్రి నుంచి వాంతులు, విరేచనాలు, జ్వరంతో బాధపడుతున్నారని, ఫుడ్ పాయిజన్‌తోనే ఇలా జరిగిందని కుటుంబీకులు తెలిపారు. ప్రస్తుతం జీవన్ రెడ్డి ఆరోగ్యంగానే ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన వర్గీయులు పేర్కొన్నారు. మంత్రి లక్ష్మణ్ కాసేపట్లో జీవన్ రెడ్డిని పరామర్శించనున్నారు.


