News February 21, 2025
తిప్పర్తి: కరెంట్ షాక్‌తో చెట్టు మీదే వ్యక్తి మృతి

కరెంట్ షాక్‌తో మేకల కాపరి మృతి చెందిన ఘటన తిప్పర్తి మండలంలోని మర్రిగూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాషా(48) మేకల కాపరిగా జీవనం కొనసాగిస్తున్నాడు. వాటి మేత కోసం తుమ్మచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి చెట్టు మీదనే మృతి చెందాడు.
Similar News
News February 22, 2025
హుజూర్నగర్: డాబా పైనుంచి పడి యువకుడి మృతి

గరిడేపల్లి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి సాయిరాం పనిచేస్తూ వనస్థలిపురంలో ఉంటున్నాడు. గురువారం రాత్రి హుజూర్నగర్ పట్టణంలోని తన స్నేహితుడు నరేశ్ వాళ్ల బావ ఓరుగంటి శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు. వారితో కలిసి డాబా ఎక్కి మద్యం తాగుతుండగా ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడి మృతిచెందినట్లు వారు తెలిపారు. తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నట్లు మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు SI ముత్తయ్య కేసు నమోదు చేశారు.
News February 22, 2025
నల్గొండ: ఎమ్మెల్సీ ఎన్నికలపై అలర్ట్

NLG- KMM- WGL ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్‌కు మరో ఐదు రోజులే గడువుంది. ఈ నేపథ్యంలో.. అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈనెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో 518 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ తెలిపారు.
News February 22, 2025
మునుగోడు: ధరణి ఫైళ్లను పరిశీలించిన కలెక్టర్

మునుగోడు తహశీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ధరణి ఫైళ్లను పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని పరిష్కరించారని అడిగి తెలుసుకున్నారు. ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట చండూర్ ఆర్డీఓ శ్రీదేవి తదితరులు ఉన్నారు.