News February 7, 2026
తిప్పర్తి: ట్రాక్టర్‌పై నుంచి పడి చిన్నారి మృతి

ట్రాక్టర్‌పై నుంచి పడి చిన్నారి మృతి చెందిన విషాద ఘటన తిప్పర్తి మండలం వెంకటాద్రిపాలెంలో చోటు చేసుకుంది. గ్రామస్థుల వివరాలు.. కొల్లు సైదులు అశ్విని దంపతులకు ఇద్దరు కుమార్తెలు. శనివారం సైదులు యూరియా బస్తాల కోసం వెళ్తుండగా పెద్ద కూతురు మనస్విని(2) వెంట వస్తానని మారం చేయగా తీసుకెళ్లాడు. ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తుండగా సీట్లో కూర్చున్న పాపం జారిపడటంతో తలకు బలమైన గాయమై అక్కడిక్కడే మృతి చెందిది.
Similar News
News February 7, 2026
ఇంట్లో నుంచే LPG కనెక్షన్‌కి ఆధార్ లింక్..!

LPG & ఉజ్వల గ్యాస్ వినియోగదారులు తప్పకుండా ఆధార్ e-KYCని పూర్తి చేయాలని కేంద్ర సహజ వాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటికే 75% మంది ఈ ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలిపింది. మిగిలినవారు స్మార్ట్‌ఫోన్ ద్వారా ఫ్రీగా KYC చేసుకోవచ్చు. ఈ <
News February 7, 2026
బ్యాలెట్ బాక్సులకు పటిష్ట భద్రత: ఎస్పీ జానకి

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సహా భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ పత్రాల నిల్వ కోసం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా ఎస్పీ డి.జానకి శనివారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ యార్డు వద్ద వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను సమీక్షించారు.
News February 7, 2026
అప్పికట్లలో ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ను తనిఖీ చేసిన కలెక్టర్

ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరవేయడం, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా చేపట్టిన ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ శనివారం తనిఖీ చేశారు. బాపట్ల మండలం అప్పికట్లలో పర్యటించిన ఆయన.. సర్వే నమోదు ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించారు. వివరాల నమోదులో ఖచ్చితత్వం పాటించాలని, ప్రజలకు సేవలందించడంలో జాప్యం చేయకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


