News December 14, 2025
తిమ్మాజిపేట: టాస్‌తో సర్పంచ్‌గా ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి..!

నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం వెంకయపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ మద్దతుగల ఆలేటి ఇందిరా, ప్రత్యర్థి కుప్పిరెడ్డి వెంకటేశ్వరమ్మ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. మొత్తం 543 ఓటర్లు ఉండగా, 472 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు పోలవడంతో రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో టాస్ నిర్వహించారు. అదృష్టం ఆలేటి ఇందిరాను వరించింది.
Similar News
News December 16, 2025
కడప జిల్లాకు జోన్-5 కేటాయింపు

APలోని 26 జిల్లాలను జోన్‌ల వారీగా విభజించే క్రమంలో కడప జిల్లాను జోన్-5 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-5గా చోటుదక్కింది.
News December 16, 2025
బాపట్ల జిల్లాకు జోన్-4 కేటాయింపు

APలోని 26 జిల్లాలను జోన్‌ల వారీగా విభజించే క్రమంలో బాపట్ల జిల్లాను జోన్-4 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో బాపట్ల, పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు జోన్-4గా చోటుదక్కింది.
News December 16, 2025
అన్నమయ్య జిల్లాకు జోన్-5 కేటాయింపు

APలోని 26 జిల్లాలను జోన్‌ల వారీగా విభజించే క్రమంలో అన్నమయ్య జిల్లాను జోన్-5 పరిధిలోకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగ నియామకాల నిర్వహణ సులభతరం చేయడం, పరిపాలనా సమన్వయం మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం జోన్ విధానాన్ని అమలుచేస్తోంది. ఈ విధానంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలకు మల్టీ జోన్-2లో జోన్-5గా చోటుదక్కింది.


