News January 5, 2026
తిమ్మాపురం బీచ్‌లో వృద్ధురాలి మృతి

తిమ్మాపురం బీచ్ సమీపంలోని కమ్యూనిటీ హాల్ వద్ద గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందింది. 70 సంవత్సరాలు వయసున్న వృద్ధురాలు బీచ్ సమీపంలో రెండు రోజులుగా తిరుగుతూ ఉండగా స్థానికులు ఆహారం, దుప్పట్లు ఆమెకు ఇచ్చారు. ఆదివారం ఆమె మృతి చెందినట్లు గమనించి భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 3, 2026
గాజువాక: సచివాలయ ఉద్యోగిని పట్టుకున్న ఏసీబీ

గాజువాకలోని 74వ వార్డులో సచివాలయం అడ్మిన్ కార్యదర్శి రూ.16 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం సాయంత్రం నిఘా పెట్టి ఏసీబీ అధికారులు దాడి చేశారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
News February 2, 2026
కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు మత్స్యకారుల కృతజ్ఞతలు

బంగ్లాదేశ్ నుండి సురక్షితంగా స్వదేశం చేరుకున్న 9 మంది మత్స్యకారులు సోమవారం విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. విదేశీ వ్యవహారాల శాఖతో సమన్వయం చేసి, తమను ప్రాణాపాయం నుండి కాపాడినందుకు వారు భావోద్వేగానికి లోనయ్యారు. మత్స్యకారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్, భవిష్యత్తులో సరిహద్దుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News February 2, 2026
విశాఖ:100 రోజులు బంగ్లాదేశ్‌లో బందీలుగా

విశాఖ నుంచి వేటకు వెళ్లిన 9 మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లో చొరబడటంతో<<19027027>> 100 రోజులు బందీలుగా<<>> అక్కడ వేదన జీవితాన్ని గడిపారు. సోమవారం విశాఖ చేరుకున్న వీరికి సంఘం పెద్దలు, కుటుంబ సభ్యులు సన్మానించి కన్నీటి పర్యంతం అయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో సుధాసాగర్ వీరికి నిత్యవసర సరకులు అందించారు.


