News August 28, 2025
తిరుగు ప్రయాణం అయిన మహారాష్ట్ర గవర్నర్

తిరుమల, తిరుపతి పర్యటన అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి మహారాష్ట్ర గవర్నర్ సీపీ.రాధాకృష్ణన్ తిరుగు ప్రయాణం అయ్యారు. ఆయనకు మంత్రి పి.నారాయణ, కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ వీడ్కోలు పలికారు. బొకేలు అందజేసి శాలువాతో సత్కరించారు. బీజేపీ నాయకులు, తుడా ఛైర్మెన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఉన్నారు.
Similar News
News August 28, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
News August 28, 2025
యూరియా దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలి: వికారాబాద్ కలెక్టర్

యూరియా దుర్వినియోగం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. గురువారం యూరియా ఎరువులపై వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో వ్యవసాయ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికే 20,124 మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేశామని చెప్పారు. యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News August 28, 2025
జాతీయ క్రీడా దినోత్సవ రన్‌ను ప్రారంభించిన కలెక్టర్

క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి పెంచుకొని రాణించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవం, హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని గురువారం ఆమె మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి కలెక్టర్ నుంచి మేకల అభినవ్ స్టేడియం వరకు నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు.