News November 17, 2025

తిరుచానూరులో శ్రీవారు తపస్సు చేశారని తెలుసా?

image

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి పద్మసరోవరానికి తూర్పువైపున శ్రీసూర్య నారాయణ స్వామివారి ఆలయం ఉంటుంది. శ్రీనివాసుడు స్వయంగా సూర్య స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించి మహాలక్ష్మీ కోసం తపస్సు చేశారు. 12 ఏళ్ల తర్వాత బంగారు పద్మంలో అమ్మవారు ఆవిర్భవించారు. ఈ ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని అనేకసార్లు పునరుద్ధరించారు. 1866 ఏప్రిల్ 23న హథీరాంజీ మఠం వారు జీర్ణోద్ధరణ చేశారు.

Similar News

News November 17, 2025

KNR: NTR వీరాభిమాని గుండెపోటుతో మృతి

image

రాజకీయాల్లో చంద్రబాబు నాయడు కంటే సీనియర్, NTR వీరాభిమాని కళ్యాడపు ఆగయ్య గుండెపోటుతో KNRలో మృతి చెందారు. TDP ఆవిర్భావం నుంచి ఆగయ్య పార్టీని వీడకుండా పనిచేస్తూ ఎన్టీఆర్ వీరాభిమానిగా గుర్తింపు పొందారు. పేరు పెట్టి పిలిచేంతగా, ఎన్టీఆర్ కుటుంబంలో తెలిసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సేవలను గుర్తించి మహానాడు కార్యక్రమంలో ఆగయ్యను సన్మానించారు కూడా.

News November 17, 2025

హిందువులపై దాడులు బాధాకరం: షేక్ హసీనా

image

బంగ్లాదేశ్‌లో యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనార్టీలు, ముఖ్యంగా హిందువులపై దాడులను ప్రోత్సహిస్తోందని మాజీ PM షేక్ హసీనా మండిపడ్డారు. దీంతో వారంతా పారిపోవాల్సి వస్తోందన్నారు. దేశంలో హింస పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యం, లౌకిక నిర్మాణం క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆందోళనలతో హసీనా గతేడాది ఆగస్టు 5 నుంచి భారత్‌లో ఆశ్రయం పొందుతోన్న విషయం తెలిసిందే.

News November 17, 2025

MBNR: యువకుడి దారుణ హత్య.. నలుగురి అరెస్ట్

image

తమ్ముడి వివాహానికి సహకరించిన అన్నను <<18301281>>హత్య<<>> చేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులు సోమవారం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. గ్రామంలో కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించనుండగా పోలీసులు భారీగా మోహరించారు. యువతి తండ్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.