News December 8, 2025
తిరుచానూరు: ఆయన పేరు కలెక్షన్ కింగ్ అంటూ చర్చ..!

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తీర్థం, శఠారి ఇస్తూ వీఐపీల నుంచి, సామాన్య భక్తుల నుంచి సంబంధిత అనధికారిక స్వామి కానుకలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జీతం లేని వ్యక్తికి ప్రతిరోజు కలెక్షన్ వేల రూపాయల ఆదాయం అని తెలుస్తుంది. ఇంత జరుగుతుంటే విజిలెన్స్ అధికారులు ఏమి చేస్తున్నారనేది ప్రశ్న. దీని వెనుక ఓ కీలక వ్యక్తి ఉన్నట్లు సమాచారం.
Similar News
News December 11, 2025
గురువారం బృహస్పతిని పూజిస్తే..

మహావిష్ణువుతో పాటు బృహస్పతిని కూడా గురువారం ఆరాధించడం వల్ల కుటుంబంలో శాంతి, సిరిసంపదలు, సంతోషం కలుగుతాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. దత్తాత్రేయుడిని కూడా పూజించవచ్చని అంటున్నారు. ఈ వారానికి అధిపతి అయిన బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి అరటి బోదెలో దీపం వెలిగించడం, పసుపు దుస్తులు ధరించడం, అదే రంగు పూలు సమర్పించడం శుభప్రదం. నెయ్యి, బెల్లంతో నైవేద్యం పెట్టాలి’ అని చెబుతున్నారు.
News December 11, 2025
TML: కల్తీ అని తెలిసినా ఎలా అనుమతించారు?

తిరుమల కల్తీ నెయ్యి కేసు సిట్ కస్టడీలో రెండో రోజు ముగిసింది. అధికారులు అడిగిన ప్రశ్నలకు అజయ్ కుమార్ సుగంధ్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని సమాచారం. మైసూరు రిపోర్ట్ వచ్చాక ఎవరికి చెప్పారు? కల్తీ అని తెలిసినా ఎందుకు తప్పు చేశారు? వారు ఇచ్చే కమీషన్లకు ఎందుకు తలొగ్గారు? అని సుబ్రహ్మణ్యాన్ని ప్రశ్నించారు. ఈయన కొన్నింటికి సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది.
News December 11, 2025
నంద్యాల మీదుగా వెళ్లే రైలుకు బోగీల పెంపు

నంద్యాల మీదుగా ప్రయాణించే గుంటూరు-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీల్లో మార్పు చేశారు. గతంలో 19 బోగీలతో ఉన్న ఈ రైలు ఇక నుంచి 24 బోగీలతో ప్రయాణించనుంది. ఇందులో ఒక సెకండ్ ఏసీ, మూడు థర్డ్ ఏసీ, 14 స్లీపర్, నాలుగు జనరల్ బోగీలు ఉంటాయి. ఈ సౌకర్యం ఈ నెల 18 నుంచి తిరుపతి వైపు రైలుకు, 19 నుంచి గుంటూరు వైపు రైలుకు అందుబాటులోకి రానుంది.


