News November 21, 2025

తిరుచానూరు పంచమికి పటిష్ట భద్రత

image

తిరుచానూరులో పంచమి తీర్థం సందర్భంగా భారీగా భక్తులు రానున్న నేపధ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పుష్కరిణి ప్రాంతంలో డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా నిఘా, కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ చేపట్టారు. రెండువేల మంది సిబ్బందితో బందోబస్తు, లైఫ్ గార్డులు, SDRF, డైవర్స్ నియామకం చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రావడంతో భక్తులు సూచనలు పాటించాలని పోలీసులు కోరారు.

Similar News

News November 22, 2025

పల్నాడు: సాగర్–శ్రీశైలం లాంచీ సర్వీసులు ప్రారంభం

image

మాచర్ల మండలం నాగార్జునసాగర్–శ్రీశైలం లాంచీ సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పర్యాటకశాఖ నేటి నుంచి సర్వీసులు ప్రారంభిస్తోంది. పెద్దలకు వన్‌వే రూ.2వేలు, రెండు వైపులా రూ.3250. 5–10 ఏళ్ల పిల్లలకు ఒకవైపు రూ.1600, రిటర్న్‌ రూ.2600గా నిర్ణయం. టికెట్ల కోసం పర్యాటకశాఖ వెబ్‌సైట్‌ ద్వారా బుకింగ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

News November 22, 2025

యాపిల్ ఎయిర్‌డ్రాప్ ఫీచర్ క్రాక్ చేసిన గూగుల్

image

ఐఫోన్లలో ఉండే క్విక్ షేర్ ఫీచర్ ఎయిర్‌డ్రాప్‌ను గూగుల్ క్రాక్ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్లకు డేటా, ఫొటోలు, వీడియోలు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చని వెల్లడించింది. యాపిల్ సహకారం లేకుండానే దీనిని సాధించామని గూగుల్ ప్రతినిధి అలెక్స్ మొరికోనీ తెలిపారు. పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అన్ని మోడల్స్‌లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దీని వల్ల యూజర్ల సేఫ్టీకి ఏ ఇబ్బంది ఉండదన్నారు.

News November 22, 2025

హుజురాబాద్‌‌లో దూరవిద్య తరగతులు ప్రారంభం

image

డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులకు దూర విద్యా తరగతులు ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతున్నాయని హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి. ఇందిరా దేవి, అధ్యయన కేంద్ర కోఆర్డినేటర్ కె.మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దూరవిద్య విధానంలో ప్రవేశం పొందిన విద్యార్థులు ప్రతి ఆదివారం జరిగే తరగతులకు హాజరు కావాలన్నారు.