News November 17, 2025
తిరుచానూరు వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

AP: తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం ధ్వజారోహణం జరగగా, రాత్రి చిన్నశేష వాహన సేవ ఉంటుంది. 18న పెద్దశేష వాహనం, 19న ముత్యపు పందిరి వాహనం, 20న కల్పవృక్ష వాహనం, 21న పల్లకీ ఉత్సవం, 22న సర్వభూపాల వాహనం, రాత్రి గరుడ వాహనం, 23న సూర్యప్రభ వాహనం, 24న రథోత్సవం, 25న పంచమీతీర్థం, రాత్రి ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయి.
Similar News
News November 17, 2025
చిన్న బ్యాంకుల విలీనానికి కేంద్రం యోచన

ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్యను కుదించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం ఇవి 12 ఉండగా 6 లేదా 7కు తగ్గించాలని నిర్ణయించినట్లు ‘ఇన్‌ఫార్మిస్ట్’ రిపోర్టు పేర్కొంది. చిన్న బ్యాంకులను SBI, PNBలతో అనుసంధానించడం లేదంటే నేరుగా విలీనం చేయాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు వివరించింది. విలీనంతో వాటిని పెద్ద సంస్థలుగా మార్చడం వల్ల స్థిర ప్రణాళికతో లాభాలు ఆర్జించొచ్చని భావిస్తున్నట్లు నివేదించింది.
News November 17, 2025
పశువుల మేతగా.. పంటకు ఎరువుగా ‘అజొల్లా’

‘అజొల్లా’ అనేది పుష్పించని ఆకుపచ్చ ‘ఫెర్న్’జాతికి చెందిన మొక్క. ఇది నీటి మీద తేలుతూ పెరిగే నాచులా ఉంటుంది. ఈ మొక్క పంటసాగులో పచ్చిరొట్టగా, జీవన ఎరువుగా, పశువుల మేతగా ఉపయోగపడుతుంది. రైతులు అజోల్లా సాగు చేపట్టి వారి పొలంలో వేసుకోవడమే కాకుండా పాడి పశువులకు, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపలకు దాణాగా అందించవచ్చు. దీని వల్ల అతి తక్కువ ఖర్చులో బహుళ ప్రయోజనాలను పొందవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
News November 17, 2025
అజొల్లాను ఎలా ఉత్పత్తి చేయవచ్చు?(1/2)

చెట్ల నీడలో గోతులు తవ్వి లేదా సిమెంట్ తొట్టెలలో లేదా పోర్టబుల్ కంటైనర్ ఉపయోగించి అజొల్లాను పెంచవచ్చు. గోతులు తవ్వి అజొల్లాను పెంచితే బయటి నుంచి ఎటువంటి వేర్లు లోపలికి రాకుండా ప్లాస్టిక్ సంచులను గోతి లోపల పరచాలి. దాని మీద పాలిథీన్ షీట్ పరిచి నీరు నిల్వ ఉంచే కృత్రిమ తొట్టెలా తయారు చేసుకోవాలి. 10-15 కిలోల సారవంతమైన మట్టిని జల్లెడ పట్టి మొత్తని మట్టిని షీట్ మీద గోతిలో ఒకే విధంగా ఉండేలా చల్లుకోవాలి.


