News February 16, 2026

తిరుణాళ్లకు వెళ్లొస్తూ చెరుకుపల్లిలో యువకుడి స్పాట్‌డెడ్

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం చెరుకుపల్లిలో చోటుచేసుకుంది. గుళ్లపల్లికి చెందిన కామినేని అచ్చయ్య గోవాడ తిరునాళ్లకు వెళ్లాడు. తిరిగి చెరుకుపల్లి వస్తుండగా చెరుకుపల్లి ఊరి బయట ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో అచ్చయ్యతో పాటు ద్విచక్ర వాహనంపై ఉన్న సుధాకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు అచ్చయ్యకు భార్య, కుమారుడు ఉన్నారు.

Similar News

News February 18, 2026

అకౌంట్లలోకి డబ్బులు.. ఎప్పుడంటే?

image

PM కిసాన్ కింద 22వ విడత నిధులకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 22న కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ చేయాలని భావిస్తోంది. అయితే తేదీపై ప్రకటన రావాల్సి ఉంది. ఆ రోజు కుదరకపోతే ఈ నెల చివరిలోగా డబ్బులు జమ చేయాలని యోచిస్తోంది. PM కిసాన్ కింద కేంద్రం ఏటా మూడు విడతలుగా రూ.6,000 అందిస్తోంది. లబ్ధి పొందేందుకు ఇప్పటివరకు <>ఈ-కేవైసీ<<>> చేయనివారు వెబ్‌సైట్‌లోకి వెళ్లి పూర్తి చేయండి.

News February 18, 2026

పిల్లలకు డబ్బాపాలు పడుతున్నారా?

image

డబ్బా పాలు పట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. * అత్యవసరం అయితే తప్పా డబ్బా పాలు పట్టకూడదు. సీసాలో ఇస్తున్నప్పుడు గ్యాప్ తీసుకుంటూ ఇవ్వాలి. డబ్బా పాలే కదా అని పడుకోబెట్టి ఇవ్వకూడదు. * నెలలు నిండని పిల్లల్లో అవయవాలు ఎదగక కూడా పాలు పట్టినప్పుడు జీర్ణాశయంలోకి సాఫీగా వెళ్లక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. శిశువుల ఎదుగుదలను బట్టి, వారి వయసుకు అనుగుణంగా వైద్యుడి సలహా మేరకు మాత్రమే పాలు పట్టాలి.

News February 18, 2026

గుంటూరు DMHO వేటుకు కారణం అదేనా..?

image

గుంటూరు DMHO బదిలీ అయిన విషయం తెలిసిందే. తురకపాలెంలో ప్రబలిన జ్వరాలను గుర్తించి ఆరోగ్య శాఖను అప్రమత్తం చేయడంలో ఉదాసీనంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రజలు మృత్యువు భారిన పడుతున్నా నివారణ చర్యలు చేపట్టడంలో విజయలక్ష్మి నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గతంలో నేరుగా ఆరోగ్య శాఖ డైరెక్టర్‌కు ప్రత్తిపాడు MLA రామాంజనేయులు ఫిర్యాదు చేశారు. ఔట్‌సోర్సింగ్ నియామకాల్లో అవినీతి జరిగినట్లు ఫిర్యాదులున్నాయి.