News January 11, 2026
తిరుపతికి ఫ్లైట్ ఎక్కాలంటే రూ.13వేలు

హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్‌లో వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సాధారణంగా ఈ రూట్‌లో ఒక్కో టికెట్ రూ.3700 నుంచి రూ.4500 వరకు ఉంటుంది. ఈనెల 13వ తేదీ మాత్రం రేట్లు భారీగా పెరిగాయి. రూ.9వేల నుంచి రూ.14వేల వరకు పలుకుతోంది. తిరుపతి నుంచి హైదాబాద్ వెళ్లే ఫ్లైట్స్ మాత్రం రూ.8వేల లోపే ఉండటం గమనార్హం.
Similar News
News February 15, 2026
HNK: అక్షర చిట్ ఫండ్స్ డైరెక్టర్ అరెస్ట్

అక్షర చిట్ ఫండ్స్ డైరెక్టర్ పేరాల శ్రీవిద్యను సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. 2022లో సుబేదారి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతుండగా, ఆమెను అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి అమెరికాకు వెళ్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి జడ్జి ముందు హాజరు పరచగా, ఆమెకు రిమాండ్ విధించి నర్సంపేట జైలుకు తరలించారు.
News February 15, 2026
మెదక్: ప్రసిద్ధ శైవక్షేత్రాలు.. ఇవిగో..!

1. మెదక్ ఏడుపాయల వనదుర్గా గుడి
2. కొమురవెల్లి మల్లన్న ఆలయం
3. ఝరాసంగం కేతకి సంగమేశ్వరాలయం
4. హుస్నాబాద్ రాజేశ్వరుడి గుడి
5. సిద్దిపేట శరభేశ్వర ఆలయం
6. ముంబోజిపల్లి మల్లికార్జున స్వామి ఆలయం
7. కాజిపల్లి కాలభైరవ సన్నిధి
8. వర్గల్ శంభు లింగేశ్వర గుడి
9. బడంపేట రాచన్నస్వామి ఆలయం
10. కంగ్టి సిద్దేశ్వర గుడి
11. ఖేడ్ కాశీనాథ మందిరం
12. రాయికోడ్ వీరభద్ర స్వామి ఆలయం
13. ఫసల్వాది మహామేరు క్షేత్రం
SHARE IT.
News February 15, 2026
ఉపవాసాలు – రకాలు.. మీది ఏ రకం?

ఉపవాసాలు 5 రకాలు. అందులో మొదటిది, కఠినమైనది నిర్జల ఉపవాసం. ఇందులో నీరు కూడా తాగరు. రెండో రకం జల ఉపవాసం. ఇందులో నీటిని మాత్రమే తాగుతారు. ఇక మూడోది ద్రవ ఉపవాసం. ఇందులో కొబ్బరినీళ్లు వంటి పానీయాలు తీసుకోవచ్చు. నాలుగోది ఫలోపవాసం. ఇందులో పాలతో పాటు పండ్లు కూడా తీసుకోవచ్చు. ఇక చివరిది సాత్విక ఉపవాసం. ఇందులో సగ్గుబియ్యం వంటి తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు. ఇందులో మీది ఏ ఉపవాసం? COMMENT


