News March 8, 2025
తిరుపతికి వెళ్లే రైలు ప్రతి రోజు నడపాలి: పొన్నం

కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్ళే రైలు (12762) ఆది , గురువారాల్లో, తిరుపతి నుంచి కరీంనగర్ (12761)బుధ, శనివారాల్లో మాత్రమే నడుస్తుంది. ఈ రైలును ప్రతిరోజూ నడిపేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. ఈ రైలును తాను ఎంపీగా ఉన్నప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలు తిరుపతి వెళ్ళడానికి సులభతరంగా ఉంటుందని UPA ప్రభుత్వంలో ప్రారంభించినట్లు గుర్తు చేశారు.
Similar News
News April 22, 2025
464/470 సాధించిన కేశవపట్నం కస్తూర్బా విద్యార్థిని

ఓదెల మండలంలోని గుంపులకు చెందిన పంజాల స్వాతి కేశవపట్నంలోని కస్తూర్బా పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. పేద కుటుంబానికి చెందిన స్వాతి ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో 464/470 మార్కులు సాధించింది. కస్తూర్బా పాఠశాల టాపర్‌గా నిలిచింది. పాఠశాల హెచ్ఎం స్వాతికి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధిస్తానని ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమన్నారు.
News April 22, 2025
కరీంనగర్: ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 68.23 శాతం

ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 17,794 మందికి 12,141 మంది పాసయ్యారు. 68.23 శాతం పాస్ పర్సంటేజీ వచ్చింది. సెకండ్ ఇయర్‌లో 15,187 మంది పరీక్షలు రాయగా 11,092 మంది పాసయ్యారు. 73.04 శాతం పర్సంటేజీ వచ్చింది.
News April 22, 2025
కొత్తపల్లి చెరువులో దొరికిన మృతదేహం వివరాలు లభ్యం

కరీంనగర్ కొత్తపల్లి హవేలీ చెరువులో యువకుడి మృతదేహం కనిపించిన విషయం తెలిసిందే. మృతి చెందిన వ్యక్తి భార్గవ్‌గా పోలీసులు గుర్తించారు. భార్గవ్ తల్లిదండ్రులు కొత్తపల్లికి చెందిన పబ్బోజు నాగరాజు యాదలక్ష్మి కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఈ క్రమంలో కొత్తపెళ్లి చెరువు వద్ద మృతదేహం లభించడంతో ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.