News December 12, 2025
తిరుపతిలో అంగన్వాడీల భారీ ఆందోళన

తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆందోళనకు దిగారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన అంగన్వాడీ ఉద్యోగులు తిరుపతి కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. తమకు అందుతున్న వేతనాలు సరిపోవడం లేదని చెప్పారు. ప్రభుత్వం వెంటనే జీతం పెంచాలని.. అర్హులైన వారికి అంగన్వాడీ కార్యకర్తలుగా ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సిబ్బంది ధర్నాకు వెళ్లడంతో పలుచోట్ల అంగన్వాడీలు మూతపడ్డాయి.
Similar News
News December 12, 2025
హైదరాబాద్‌లో అఖిలేశ్.. రేవంత్, కేటీఆర్‌తో భేటీ

TG: యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రేవంత్ ఆయనకు వివరించారు. అటు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోనూ సమావేశమైన అఖిలేశ్ రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
News December 12, 2025
PPM: ‘ఇంటి వద్దకే గ్యాస్ సిలిండర్లను ఉచితంగా డెలివరీ చేయాలి’

జిల్లాలోని వినియోగదారుల ఇంటి వద్దకే గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేయాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి గ్యాస్ ఏజెన్సీ డీలర్లకు స్పష్టం చేశారు. గ్యాస్ డెలివరీని ఉచితంగా చేయాల్సి ఉన్నప్పటికీ, ఛార్జీలను వసూలు చేస్తే ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. అటువంటి డీలర్లు ఉంటే పద్ధతులు మార్చుకోవాలని, లేదంటే లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో సమీక్షించారు.
News December 12, 2025
MHBD: ఈనెల 13న జవహార్ నవోదయ పరీక్ష!

జవహర్ నవోదయ విద్యాలయంలో 2026 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షను ఈనెల 13న నిర్వహిస్తున్నట్లు మామునూర్ జవహర్ నవోదయ ప్రిన్సిపల్ బి.పూర్ణిమ శుక్రవారం తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 28 సెంటర్లలో 5648 మంది పరీక్ష రాస్తున్నారన్నారు. ఉదయం 11:30 నుంచి మ.1:30 వరకు పరీక్ష జరుగుతుందని,
అడ్మిట్ కార్డ్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. https://navodaya.gov.in


