News March 11, 2025

తిరుపతిలో అత్తను చంపిన అల్లుడి అరెస్ట్

image

తిరుపతి చిన్నగుంటలో ఈనెల 7న ఓ మహిళ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛేదించారు. స్థానికంగా ఉన్న గోపాల్ రెడ్డి భార్య ప్రమీల పాచిపనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఆమె అల్లుడు రవీంద్ర నాయక్ మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో మద్యాన్ని డబ్బులు ఇవ్వాలని ఆమెను కోరగా నిరాకరించింది. ఇద్దరి మధ్య గొడవ జరగ్గా.. ప్రమీలను కట్టేసి కాళ్లతో తన్ని గొంతు నులిమి హత్య చేశాడు. 

Similar News

News March 12, 2025

సాగునీటి నిర్వహణలో ప్రభుత్వం విఫలం: KCR

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపడా సమయం ఇచ్చామని, మూడో వంతు సమయం పూర్తైందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటి నిర్వహణ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. దళితబంధు నిలిపివేయడం, గొర్రెల పెంపకం, చేపల పంపిణీపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టం చేశారు.

News March 12, 2025

నంద్యాల జిల్లా TODAY TOP NEWS.!

image

☞ జిల్లాకు చెందిన పదవ తరగతి ప్రశ్న పత్రాలు☞ గాజులపల్లె మెట్ట వద్ద డ్రైనేజ్ కాలువ దుర్గంధం☞ జొన్నకు మద్దతు ధర కల్పించండి: మంత్రులు☞ పాండవగల్లులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం☞ మంత్రి బీసీపై విమర్శలు తగవు: టీడీపీ నేతలు☞ పదవ తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం☞ TDP MLC అభ్యర్థి బీటీ నాయుడు ఆస్తులు రూ.5.68 కోట్లు ☞ పోసాని కేసు.. ఆదోని పోలీసుల కస్టడీ పిటిషన్ డిస్మిస్

News March 12, 2025

మహేశ్ బాబు-రాజమౌళి సినిమా కథ ఇదేనా?

image

మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రానున్న సినిమా గురించి బాలీవుడ్ పోర్టల్ పింక్ విల్లా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం.. ఈ మూవీ కథ కాశీ చరిత్రకు సంబంధించిందిగా ఉండనుంది. పురాణాలకు, నేటి కాలానికి ముడిపెడుతూ సినిమా సాగుతుంది. దీని కోసమే మూవీ టీమ్ హైదరాబాద్‌లో కాశీ సెట్ వేశారు. రామాయణంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చే ఘట్టం ఈ కథకు ప్రధాన స్ఫూర్తి అని తెలుస్తోంది.

error: Content is protected !!