News April 16, 2025
తిరుపతిలో అమానుష ఘటన

తిరుపతి రూరల్ మండలం బీటీఆర్ కాలనీలో ఓ వృద్ధుడు స్థానికంగా ఉంటున్న పిల్లలకు తన ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. నిన్న తన ఇంట్లో ముగ్గురు చిన్నారులకు వీడియోలు చూపిస్తుండగా స్థానికులు గమనించారు. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు మేస్త్రి పనులు చేసే సెల్వంగా గుర్తించి అతడి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News April 16, 2025
ఇన్‌స్టా ఫాలోయింగ్‌పై పూజా హేగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్ల సంఖ్య బాక్సాఫీసును డిసైడ్ చేయలేదని హీరోయిన్ పూజా హెగ్డే అన్నారు. ‘నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 30 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండొచ్చు. కానీ వారందరూ థియేటర్లకు వస్తారని కాదు. చాలా మంది సూపర్ స్టార్లకు 5 మిలియన్ల కంటే తక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాకు, వాస్తవానికి చాలా తేడా ఉందని అర్థం చేసుకోండి’ అని ఆమె తెలిపారు.
News April 16, 2025
MHBD: చిన్నారిపై కత్తితో కాల్చి వాతపెట్టిన అంగన్వాడి ఆయా

మహబూబాబాద్ పట్టణం సిగ్నల్ కాలనీలోని అంగన్ వాడీ కేంద్రంలో విద్యనభ్యసిస్తున్న మణిదీప్(5)పై అంగన్వాడి ఆయా కత్తితో కాల్చి వాత పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయా దాష్టికంపై సీడీపీవోకు చిన్నారి తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే ఘటన జరిగి 4 రోజులు అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో అంగన్వాడీ సెంటర్ ముందు బాధితుడి బంధుమిత్రులు ఆందోళనకు దిగారు.
News April 16, 2025
విచారణకు హాజరైన పైలెట్, కోపైలెట్

మాజీ సీఎం వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా హెలికాప్టర్ విండో షీల్డ్‌కు ఎయిర్ క్రాక్ ఘటనప్తె పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు పైలెట్, కోపైలెట్‌ను చెన్నేకొత్తపల్లి పోలీసులు విచారిస్తున్నారు. హెలిప్యాడ్ వద్ద జరిగిన పరిణామాలపై పోలీసులు నిగ్గు తేల్చనున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.