News February 27, 2026

తిరుపతిలో గరుడ వారధిపై యువకుడి మృతి

image

తిరుపతిలో గరుడ వారధిపై మరొకరు చనిపోయారు. తాతయ్యగుంటకు చెందిన ఆదం ద్వారక(23) తిరుచానూరులో జరిగిన వివాహానికి వెళ్లాడు. మరొకరితో కలిసి బైకుపై తిరిగి వస్తుండగా.. బ్లిస్ సర్కిల్ సమీపంలో గరుడ వారధిపై బైక్ అదుపుతప్పి గోడను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ద్వారక స్పాట్‌లోనే చనిపోయాడు. స్వల్ప గాయాలతో బయటపడిన మరో యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హేమాద్రి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 1, 2026

ఎన్టీఆర్: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బి.ఎస్సీ. చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 13 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు వర్శిటీ పరిధిలోని కళాశాలలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని అధ్యాపకులు తెలిపారు. టైమ్ టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని కోరారు.

News March 1, 2026

వికారాబాద్ జిల్లాలో జాబ్ మేళా

image

వికారాబాద్ జిల్లా నిరుద్యోగ యువతకు ‘శుభ గృహ ఇన్ఫ్రాస్ట్రక్చర్’ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్ పోస్టుల భర్తీకి మార్చి 5న ఉ.10:30 గం.కు వికారాబాద్ ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళా ఉంటుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపారు. 30కి పైగా ఉన్న ఉద్యోగాలకి 10th, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, B.Tech, MBA, అర్హతలు కలిగిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News March 1, 2026

పరీక్షల సమయం.. లిఫ్ట్ అడిగితే ఇవ్వండి!

image

ప్రస్తుతం పరీక్షల సీజన్ కావడంతో విద్యార్థులు తమ ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లే హడావిడిలో ఉంటారు. సరైన సమయానికి సెంటర్‌కు చేరుకోవాలనే ఆరాటంలో రవాణా సౌకర్యాలు లేక చాలామంది రోడ్లపై లిఫ్ట్ కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటివారికి లిఫ్ట్ ఇవ్వడం వల్ల ఒక విద్యార్థిని సకాలంలో పరీక్ష హాల్‌కు చేర్చి, వారి విద్యా సంవత్సరం వృథా కాకుండా చేసినవారవుతారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఓ క్షణం ఆలోచించండి. share it