News January 8, 2026
తిరుపతిలో టోకెన్ల జారీ ప్రారంభం

తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో SSD టోకెన్లు జారీ గురువారం నుంచి ప్రారంభమైంది. వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో గత నెల 29న జారీ నిలిపివేశారు. తిరిగి గురువారం నుంచి ప్రారంభం కావడంతో భక్తులు రద్దీ సాధారణం కొనసాగుతోంది. ప్రస్తుతం 4వేలు SSD, 900 శ్రీవారి మెట్టు టోకెన్లు అందుబాటులో ఉన్నాయి.
Similar News
News February 6, 2026
ఆసిఫాబాద్: నలుగురికి 7 ఏళ్ల శిక్ష

వన్యప్రాణుల వేటకు అక్రమంగా విద్యుత్ అమర్చి ఓ వ్యక్తి మృతికి కారణమైన కేసులో నలుగురు నిందితులకు 7ఏళ్ల శిక్షతో పాటు రూ.30,000 జరిమానా విధిస్తూ ASF జిల్లా సెషన్స్ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 2018లో చింతలమానేపల్లి మండలం రవింద్రనగర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో దోషులకు గురువారం శిక్ష పడినట్లు ఎస్పీ నితికా పంత్ తెలిపారు.
News February 6, 2026
ఎడ్లపాడు: హైకోర్టును ఆశ్రయించిన విడదల రజిని

బోయపాలెం శ్రీవారి ఆలయ పర్యటనలో విద్వేషాలు రెచ్చగొట్టారనే ఆరోపణలపై నమోదైన కేసు విషయంలో మాజీ మంత్రి విడదల రజిని హైకోర్టును ఆశ్రయించారు. ఎడ్లపాడు పోలీసులు నమోదు చేసిన ఈ కేసును కొట్టివేయాలని ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిగింది. దీనిపై స్పందించిన న్యాయస్థానం, నిందితులకు 35 (3) నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
News February 6, 2026
HYDలో అంతుచిక్కని Mystery!

విజయశాంతి సూసైడ్ కేసులో మిస్టరీ వీడలేదు. భర్తతో విభేదాలు, ఫ్యామిలీ టెన్షన్స్ లేవు. మెరుగైన జీవనం సాగిస్తోన్న ఫ్యామిలీ రైల్వే పట్టాలపై మృతదేహాలుగా మారడం అంతు చిక్కడం లేదు. సాంకేతిక ఆధారాలు పరిశీలించగా 2 అఫీషియల్ కాల్స్ మాత్రమే ఉన్నాయట. కారులో లభించిన ల్యాప్‌టాప్‌ను సైతం FSLకి పంపారు. అయితే, తల్లితో పాటు పిల్లలు కూడా సూసైడ్ చేసుకోవడం వెనుక కారణం ఏంటనే కోణంలో SCR పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.


