News April 20, 2025
తిరుపతిలో నూతన ఆసుపత్రిని ప్రారంభించిన కలెక్టర్

తిరుపతిలో నూతన ట్రామా కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఆదివారం మంగలం రోడ్ కరకంబాడ్ దగ్గర గల తిరుపతి ట్రామా కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్‌ను బోర్డు సర్టిఫైడ్ సర్జన్, పిల్లల ఆర్థోపెడిక్ సర్జన్ డా.దుర్గాప్రసాద్‌తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు.
Similar News
News December 16, 2025
వే2న్యూస్ రీల్ రిపోర్టర్: ₹15,000కు పైగా సంపాదించే అవకాశం

Way2News ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 2000 మందికి పైగా రీల్ రిపోర్టర్ల కోసం చూస్తోంది. మీకు కావలసిందల్లా ప్యాషన్, ఒక స్మార్ట్‌ఫోన్ మాత్రమే. న్యూస్ & ఇన్ఫర్మేటివ్ వీడియో రీల్స్ క్రియేట్ చేయండి. మీ కంటెంట్‌కి తగ్గట్టు ప్రతి నెల ₹15,000కు పైగా సంపాదించవచ్చు. రీల్ రిపోర్టర్ ప్రోగ్రామ్‌లో ఎవరైనా జాయిన్ కావచ్చు. వివరాలకు <
News December 16, 2025
కనకాంబరంలో ఆకుమచ్చ తెగులు

కనకాంబరం పంటను ఆశించే చీడపీడల్లో ఆకుమచ్చ తెగులు ఒకటి. ఆకుమచ్చ తెగులు సోకిన కనకాంబరం మొక్క ఆకు పైభాగంలో చిన్న, గుండ్రని పసుపు పచ్చ మచ్చలు ఏర్పడి.. తర్వాత గోధుమ రంగులోకి మారతాయి. తెగులు సోకిన ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. దీని వల్ల మొక్క ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. ఈ తెగులు నివారణకు 2.5గ్రా మాంకోజెబ్‌ను లీటర్ నీటికి కలిపి ఆకులన్నీ తడిచేలా పిచికారీ చేయాలి.
News December 16, 2025
శ్రీకాకుళం జిల్లాలో 1,55,876 మంది పిల్లలకు పోలియో చుక్కలు

ఈనెల 21 నుంచి జిల్లాలో జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. (0-5) ఏళ్లలోపు 1,55,876 మంది పిల్లలు ఉన్నారని, ఆయా కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయనున్నట్లు DMHO డాక్టర్ కే అనిత మంగళవారం తెలిపారు. అందుబాటులో లేని వారికి 22 – 25 తేదీల్లో ఇంటింటికి వెళ్లి వేస్తారన్నారు. జిల్లాలో మొత్తం 1252 పోలియో కేంద్రాలు ఉన్నాయన్నారు.


